పుష్ప ప్రిరిలీజ్‌ ఈవెంట్‌లో గందరగోళం…కొందరికి గాయాలు

కొందరికి గాయాలపై రష్మిక ఆరా

పుష్ప’ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ఘటనపై రష్మిక స్పందించింది. ఆదివారం సాయంత్రం యూసఫ్‌ గూడలో ’పుష్ప’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈవెంట్‌కు అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ వేల సంఖ్యలో పోటెత్తారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరగడంతో కొందరు అభిమానులు  గాయపడ్డారు. ఈ విషయం తెలిసి రష్మిక ఆవేదన వ్యక్తం చేసింది.  ట్విట్టర్‌ ద్వారా ఆమె స్పందిస్తూ.. ’ఈవెంట్‌ కు హాజరైన అందరికీ ధన్యవాదాలు. విూలో కొందరు గాయపడ్డారని విన్నాను. చాలా బాధేసింది. విూరంతా బాగున్నారని, కేర్‌ తీసుకుంటున్నారని భావిస్తున్నా’ అని వ్యాఖ్యానించింది. మరోవైపు ’పుష్ప’ ఈవెంట్‌లో రష్మిక మాట్లాడుతూ… ఈ సినిమా కోసం అందరం ఎంతో కష్టపడ్డామని తెలిపింది. ఈ చిత్రంలో కొత్త ప్రపంచాన్నే సృష్టించామని… ’పుష్ప’ అందరినీ అలరిస్తుందని చెప్పింది. ఈ సినిమా కోసం చాలా రోజులుగా తన తల్లిదండ్రులకు దూరంగా ఉన్నానని తెలిపింది.