పుష్పలో ఊ.. అంటావా సాంగ్‌పై కేసు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, టాప్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం ’పుష్ప: ది రైజ్’. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్ అన్ని మంచి ప్రేక్షకాదరణ పొందాయి. అయితే ఇందులో టాలీవుడ్ హీరోయిన్ సమంత చేసిన ఐటం సాంగ్ లిరికల్ వీడియోని ఇటీవలే యూట్యూబ్‌లో విడుదల చేసింది చిత్ర బృందం. ఆ పాటకు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
’ఉ అంటావా మావా ఊ ఊ అంటావా మావా’ అనే సాగే ఆ పాటపై ఆంధ్రప్రదేశ్‌లోని పురుషుల అసోసియేషన్ కేసు వేసింది. మగవాళ్లు కేవలం కామంతోనే ఉంటారన్న అర్థం వచ్చేలా ఆ పాటను చిత్రీకరించారనీ, ఆ పాటలో పదాలతో అలాంటి భావమే వస్తోందని ఆ సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీంతో ఆ పాటపై నిషేధం విధించాలంటూ ఆంధప్రదేశ్ హైకోర్టును పురుషుల సంఘం ఆశ్రయించింది. ఈ పాటని చంద్రబోస్ రాయగా.. దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేశాడు. సమంత స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చిన ఈ సాంగ్ మంచి బజ్‌ని క్రియేట్ చేసింది. కాగా డిసెంబర్ 17న పాన్ ఇండియా లెవల్లో విడుదలకానున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.