పది కరోనా వ్యాక్సిన్లు ‌ వేసుకున్నాడు

న్యూజిలాండ్‌లో ఓ వ్యక్తి అత్యుత్సాహం

పది కరోనా వ్యాక్సిన్‌లో వేసుకున్నట్లు గుర్తింపు

వేర్వేరు గుర్తింపు కార్డులతో పది డోసులు తీసుకున్నట్లు వెల్లడి

:ఒక్క కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోవడానికే ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వ్యాక్సిన్‌ వేయించుకున్నాకే నాకు బాగోలేదని కొందరూ… బాబోయ్‌! మేము వ్యాక్సిన్‌ వేయించుకోమంటూ ఇప్పటికీ భయపడుతున్నవాళ్లు ఉన్నారు. అయితే న్యూజిలాండ్‌కి చెందిన ఓ వ్యక్తి మాత్రం ఏకంగా పది కరోనా వ్యాక్సిన్‌లు వేయించుకన్నాడు.  న్యూజిలాండ్‌కు చెందిన ఒక వ్యక్తి కేవలం 24 గంటల్లో 10 వ్యాక్సిన్‌లు తీసుకున్నట్లు తెలిసింది. దీంతో ఇది నిజమా కాదా అన్న ఉద్దేశంతో న్యూజిలాండ్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగి దర్యాప్తు చేయడం మొదలుపెట్టింది. అయితే ఆ వ్యక్తి వేర్వేరు వ్యక్తుల గర్తింపు కార్డులతో వ్యాక్సిన్‌ మరీ వేయించుకున్నాడని విచారణలో తెలుస్తుంది. దీంతో ఆరోగ్య మంత్రిత్వశాఖకు సంబంధించిన కోవిడ్‌ వ్యాక్సిన్‌ మేనేజర్‌ ఆస్టిడ్ర్‌ కూర్నీఫ్‌ ఆ వ్యక్తి ఆరోగ్యం గురించి ఆందోళనకు గురై సదరు వ్యక్తిని తక్షణమే వైద్యుడుని సంప్రదించవల్సిందిగా సూచించారు. అయితే హెల్త్‌ రికార్డు ప్రకారం ఎవరి హెల్త్‌ రికార్డు ప్రకారం వారు వేసుకోవాలని  రికార్డు కోసం వేయించుకోవడం చాల ప్రమాదం అంటూ న్యూజిలాండ్‌ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హెలెన్‌ ప్రజలను హెచ్చరించారు.