వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ..ఎంపీ బండి సంజయ్

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీచేసే అవకాశముందని..
ఆ రెండు పార్టీల మధ్య ఒప్పందం కూడా జరిగిందని అన్నారు. గతంలో కూడా ఈ రెండు పార్టీలు పొత్తులు పెట్టుకున్నాయని గుర్తు చేశారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండు పార్టీలూ ఒకటేనని.. పార్లమెంటులో టీఆర్ఎస్‌కు కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందని అన్నారు. కేవలం ఫంక్షన్లు ఉన్నాయనే కారణంగానే పార్లమెంటు సమావేశాలను టీఆర్ఎసం ఎంపీలు బహిష్కరించారని చెప్పారు.
కృష్ణా జలాల విషయంలో సీఎం కేసీఆర్.. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని సంతకం చేశారని.. రేపు దేనిపై సంతకం చేస్తారోనని అన్నారు. కేసీఆర్ దేశానికి ఉపరాష్ట్రపతి అవుతారంటూ ప్రచారం చేయించుకుంటున్నారని దుయ్యబట్టారు. వర్షాకాలం పంటను కొనుగోలు చేయబోమని కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే సీఎం కేసీఆర్‌కు కనిపించడంలేదా అని ప్రశ్నించారు.