కార్మికులకు ఇన్సూరెన్స్ వెల్ఫేర్ కార్డులు అందజేసిన ఎమ్మెల్యే 

హుజూర్నగర్ ఎమ్మెల్యే  క్యాంప్ ఆఫీస్ నందు టిఆర్ఎస్ కె.వి కార్మిక విభాగం ఆధ్వర్యంలో కార్మికులకు ఇన్సూరెన్స్ వెల్ఫేర్ కార్డు ఎమ్మెల్యే  చేతుల మీదగా అందించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్మిక సోదరులు అందరూ సోదరీమణులు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఇన్సూరెన్స్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం కార్మికులకు  ముఖ్యమంత్రి  ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. వెల్ఫేర్ కార్డులకు చేయించుకున్న వారికి ప్రభుత్వం ద్వారా శిక్షణ కేంద్రాలు ఇన్సూరెన్స్ సదుపాయాలు కలుగుతున్నాయి అన్నారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో నే యక్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆసక్తి ఉన్నవారు ప్రభుత్వ కాలేజీ నందు శిక్షణ కేంద్రంలో నేర్చుకో గలరని కోరుచున్నాను. అంతేకాకుండా మీకు అనారోగ్యంతో ఏదైనా ఇబ్బంది ఉన్నా నా దృష్టికి తీసుకువస్తే సీఎం రిలీఫ్ ఫండ్ మరియు ఎ ఓ సి ఇప్పిస్తాను. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని అని అన్నారు . ఈ కార్యక్రమంలో నియోజవర్గ కార్మిక సంఘ అధ్యక్షులు పచ్చిపాల ఉపేందర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గారు జక్కుల నాగేశ్వరరావు, రెండో వార్డు కౌన్సిలర్ జక్కుల శం భయ్యా గారు యూనియన్ అధ్యక్షులు ఎస్ కె ఆసియా, ఎస్ కె జాన్,  బి లాలమ్మ, కోటి వెంకటేశ్వర్లు , రాంబాబు,  జానీ, నజీర్,  కార్మిక నాయకులు పాల్గొన్నారు