కోహ్లీకి జట్టు సభ్యులపై అపార నమ్మకం…. సల్మాన్‌ భట్‌

గత కొంతకాలంగా పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న టెస్ట్‌ వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానేకు అండగా నిలిచిన టీమిండియా సారధి విరాట్‌ కోహ్లిపై పాక్‌ మాజీ కెప్టెన్‌ సల్మాన్‌ బట్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లి.. తన బృందంలోని సభ్యులపై అపారమైన నమ్మకం కలిగి ఉంటాడని, కష్ట సమయాల్లో వారికి అండగా నిలిచి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాడని.. ఈ లక్షణాలే అతన్ని ప్రపంచపు అత్యుత్తమ కెప్టెన్‌గా నిలబెట్టడంలో దోహదపడ్డాయని తెలిపాడు. క్రికెట్‌ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్లందరూ ఫామ్‌ కోల్పోయిన తమ బృంద సభ్యులకు మద్దుతుగా నిలిచారని, ఇలా చేయడం వల్ల ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెరిగి అత్యుత్తమంగా రాణించారని, చరిత్రే ఇందుకు సాక్షమని పేర్కొన్నాడు. తన గైర్హాజరీలో బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్సీలోనూ అద్భుతంగా రాణించి ఆసీస్‌ను వారి సొంతగడ్డపై మట్టికరిపించిన రహానేపై నమ్మకముంచడం అంత ఆశ్చర్యకరమైన విషమేవిూ కాదని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు సల్మాన్‌ బట్‌ తన యూట్యుబ్‌ ఛానల్‌లో పేర్కొన్నాడు.