యాషెస్‌ సీరిస్‌క్‌ ఇంగ్లండ్‌ జట్టు ప్రకటన

ఆస్టేల్రియాతో ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ నేపథ్యంలో తొలి టెస్టుకు ఇంగ్లండ్‌ తమ జట్టును ప్రకటించింది. బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా డిసెంబరు 8న మొదలుకానున్న మ్యాచ్‌ కోసం 12 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను వెల్లడిరచింది. మోకాలి నొప్పి కారణంగా వెటరన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ జట్టుకు దూరం కాగా… మార్క్‌ వుడ్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, ఓలీ రాబిన్సన్‌ స్పెషలిస్టు ఫాస్ట్‌బౌలర్లుగా జట్టులో స్థానం సంపాదించుకున్నారు. కాగా జో రూట్‌ సారథ్యంలోని ఇంగ్లండ్‌ జట్టు యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఆస్టేల్రియా వేదికగా ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడనున్న సంగతి తెలిసిందే.

గబ్బా టెస్టుకు ఇంగ్లండ్‌ ప్రకటించిన జట్టు:

జో రూట్‌(కెప్టెన్‌), స్టువర్ట్‌ బ్రాడ్‌, రోరీ బర్న్స్‌, జోస్‌ బట్లర్‌, హసీబ్‌ హవిూద్‌, జాక్‌ లీచ్‌, డేవిడ్‌ మలాన్‌, ఓలీ పోప్‌, ఓలీ రాబిన్సన్‌, బెన్‌ స్టోక్స్‌, క్రిస్‌ వోక్స్‌, మార్క్‌ వుడ్‌.