నేటినుంచి యాషెస్ సీరిస్
బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా ప్రారంభం
ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌కు సమయం ఆసన్నమైంది. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ బుధవారం నుంచి బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా షురూ కానుంది. కరోనా వైరస్ నేపథ్యంలో అత్యంత జాగ్రత్తల నడుమ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇరు జట్ల మధ్య మొత్తం 71 సిరీస్‌లు జరగ్గా ఆస్టేల్రియా 33 సార్లు విజయం సాధించగా, ఇంగ్లీష్ జట్టు 32 గెలిచింది. 6 సిరీస్‌లు ’డ్రా’ అయ్యాయి. 2019లో 2`2తో సిరీస్ సమం కాగా.. ఉత్కంఠగా జరిగిన ఆఖరి మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం సాధించింది. 2017`18లో ఆసీస్ 4`0తో ఇంగ్లండ్‌ను వైట్‌వాష్ చేసింది. ఫాస్ట్ బౌలర్ కమిన్స్ నేతృత్వంలో ఆసీస్ పోటీకి దిగుతుండగా.. రూట్ సారథ్యంలో ఇంగ్లీష్ సేన యుద్దానికి సై అంటున్నది. మొదటి టెస్టు (డిసెంబర్ 8`12) బ్రిస్బేన్‌లో, రెండో టెస్టు (డిసెంబర్ 16`20) అడిలైడ్, మూడో టెస్టు (డిసెంబర్ 26`30) మెల్‌బోర్న్‌లో.. నాలుగోది (జనవరి 5`9) సిడ్నీ వేదికగా జరుగనుంది. ఐదో టెస్టు(జనవరి 14`18) పెర్త్‌ను తొలుత ఖరారు చేయగా స్థానిక ప్రభుత్వ కఠిన నిబంధనల కారణంగా అక్కడ జరుగడం లేదు. త్వరలోనే ఎక్కడా అనేది ప్రకటించనున్నారు.