వైరల్ అవుతున్న ‘లక్ష్య’ మేకింగ్ వీడియో
యంగ్ హీరో నాగశౌర్య తాజా చిత్రం ’లక్ష్య’. ఆర్చరీ బ్యాక్ డ్రాప్ లో ఆసక్తికరమైన కథాకథనాలతో రూపొందుతోన్న ఈ సినిమాని కొత్త దర్శకుడు సంతోష్ జాగర్లపూడి తెరకెక్కిస్తున్నారు. యస్వీసిఎలెల్పీ, నార్త్ స్టార్ ఎంటర్ టైన్‌మెంట్స్ సంయుక్త నిర్మాణంలో సినిమా రూపొందింది. కేతిక శర్మ కథానాయికగా నటిస్తుండగా.. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నెల 10 న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. ఇటీవల విడుదలైన లక్ష్య ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. అలాగే.. ’లక్ష్య’ ప్రీరిలీజ్ ఈవెంట్ ను కూడా గ్రాండ్ గా నిర్వహించారు మేకర్స్. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మేకింగ్ వీడియో ను రిలీజ్ చేశారు. నాగశౌర్య అండ్ టీమ్ ఈ సినిమా కోసం పడ్డ కష్టమంతా అందులో కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ విూడియాలో వైరల్ అవుతోంది.
నాగశౌర్య రెండు వేరియస్ గెటప్స్ లో అలరించబోతున్న ’లక్ష్య’ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. ఇటీవల ’వరుడు కావలెను’ అనే ఫ్యామిలీ మూవీతో మంచి సక్సెస్ సొంతం చేసుకున్న శౌర్య.. ’లక్ష్య’ మూవీతో యాక్షన్ హీరోగా ఎలివేట్ కాబోతున్నారు. మేకోవర్ కోసం గంటల తరబడి జిమ్ లో కసరత్తులు చేసి సిక్స్ ప్యాక్ బిల్డ్ చేశారు. మరి ఈ సినిమా నాగశౌర్యకి ఏ స్థాయిలో పేరు తెస్తుందో చూడాలి.