రికార్డు సృష్టిస్తున్న ‘పుష్ప’ ట్రైలర్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం పుష్ప ది రైజ్ పేరిట డిసెంబర్ 17 న తేదీన ప్రపంచ
వ్యాప్తంగా విడుదల కానున్న సంగతి అందరికీ తెలిసిందే. పుష్ప చిత్రంకి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ’దాక్కో దాక్కో మేక’, ’శ్రీవల్లి’, ’సామి’, ’ఏయ్ బిడ్డా’ అనే నాలుగు పాటలు.. ’పుష్ప’ సినిమాపై ఆసక్తిని రేకెత్తించాయి. చిత్ర వర్గాలు, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ఇప్పుడా జాబితాలోకి ట్రైలర్ చేరింది. గత రాత్రి ట్రైలర్ విడుదల చేయగా, ఇది యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తుంది. ఇప్పటి వరకూ నాలుగు బాషల్లో కలిపి 15 మిలియన్స్ కి పైగా వ్యూస్ రావడం విశేషం.
పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక కథానాయికగా నటిస్తుండగా, ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడు పాత్ర పోషిస్తున్నారు. సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని ముత్తంశెట్టి విూడియాతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ రెండు భాగాలుగా నిర్మిస్తోంది. ’ది రైజ్’ పేరుతో తొలి భాగం డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకురానుంది.