Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

త్రిపాత్రాభినయంతో కళ్యాణ్‌రామ్‌ ?

 

ఎర్లియర్‌గా ‘ఎంత మంచివాడవురా’ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించారు కళ్యాణ్‌ రామ్‌. ఆ సినిమా ఆశించిన రీతిలో ఆకట్టుకోలేకపోయింది. అందుకే తదుపరి చిత్రాలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. ప్రస్తుతం ’బింబిసార, డెవిల్‌’ అనే వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండూ ఏక కాలంలో షూటింగ్‌ జరుపుకుంటున్నాయి. ఇక వీటితో పాటు మరో సినిమా కూడా ఇటీవలే షూటింగ్‌ ప్రారంభించింది. ఇంకా టైటిల్‌ నిర్ణయించని ఈ మూవీలో కళ్యాణ్‌ రామ్‌ త్రిపాత్రాభినయం చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇప్పటి వరకూ కళ్యాణ్‌ రామ్‌ ఈ తరహా సినిమా చేయలేదు.

మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణంలో కొత్త దర్శకుడు రాజేంద్ర తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటోంది. తన కెరీర్‌ లో ఇప్పటి వరకూ రెగ్యులర్‌ కమర్షియల్‌ మూవీసే చేసుకుంటూ వస్తోన్న కళ్యాణ్‌ రామ్‌.. ఇప్పుడు పూర్తిగా ప్రయోగాల బాట పట్టారు. ఇంత వరకూ నందమూరి ఫ్యామిలీలో సీనియర్‌ యన్టీఆర్‌, జూనియర్‌ యన్టీఆర్‌ తర్వాత త్రిపాత్రాభినయం చేస్తున్న హీరోగా కళ్యాణ్‌ రామ్‌ అరుదైన ఘనత దక్కించుకున్నారు. ఈ సినిమా ప్రేక్షకులకు మరిచిపోలేని అనుభూతినిస్తుందని చెబుతున్నారు మేకర్స్‌. మరి కళ్యాణ్‌ రామ్‌ ట్రిపుల్‌ రోల్స్‌ ప్రయోగం ఏ మేరకు సక్సెస్‌ అవుతుందో చూడాలి.