భవిష్యత్‌లో జీవాయుధ యుద్దాలు..జనరల్ బిపిన్ రావత్

వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి
కొత్త తరహా యుద్దాలకు సిద్దం కావాలని రావత్ పిలుపు
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. జీవాయుధ పోరాటానికి సన్నద్దంగా ఉండాలన్నారు. ప్యానెక్స్`21 ప్రారంభోత్స ఈవెంట్‌లో పాల్గొన్న త్రివిధదళాధిపతి రావత్ మాట్లాడుతూ.. ఓ కొత్త విషయాన్ని హైలెట్ చేయాలనుకున్నానని, కొత్త తరహా యుద్దానికి సన్నద్దం కావాలని, ఒకవేళ జీవాయుధ పోరాటాలు ప్రారంభం అవుతున్నట్లు గమనిస్తే, అప్పుడు మరో దానికి తగినట్లు బలోపేతం కావాలన్నారు. వైరస్‌లు, వ్యాధులు తట్టుకునే రీతిలో మన దేశం ప్రిపేర్ కావాలని సీడీఎస్ రావత్ తెలిపారు. ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళన కలిగిస్తోందని, భవిష్యత్తులో వైరస్‌లను ఎదుర్కొనేందుకు సమాయత్తమై ఉండాలన్నారు. ఏ దేశంలోనైనా ఇలాంటి సమస్య వస్తే, అప్పుడు ఒకర్ని ఒకరు ఆదుకోవాలన్నారు. ప్యానెక్స్`21 పేరుతో డిజాస్టర్ మేనేజ్మెంట్ విన్యాసాలు నిర్వహిస్తున్నారు. ఈ విన్యాసాల్లో బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్ శ్రీలంక, మయన్మార్, థాయిలాండ్ దేశాలు పాల్గొంటున్నాయి. మూడు రోజుల పాటు ఆ విన్యాసాలు ఉంటాయి. ఇప్పుడి వరకు రకరకాల విపత్తులు వచ్చాయని, కొన్ని సహజమైనవి కాగా, మరికొన్ని మనుషులు సృష్టించినవని, అయితే వైరస్‌లతో వచ్చే మహమ్మారులను ఎదుర్కొనేందుకు మనం ప్రిపేరై ఉండాలని రావత్ తెలిపారు. ఇప్పుడు ఒమిక్రాన్ వ్యాపిస్తోందని, ఒకవేళ ఆ వేరియంట్ కూడా మ్యుటేట్ అయితే, అప్పుడు వాటిని
కూడా ఎదుర్కోవాలన్నారు. భారత సైనిక చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణెళి మాట్లాడుతూ.. కొత్త వేరియంట్ల రాకతో కొత్తగా కేసులు పెరుగుతున్నాయని, దీంతో ఇప్పట్లో కోవిడ్ మహమ్మారి వెళ్లిపోయేలా లేదన్నారు. వాతావరణ మార్పులు, ప్రణాళికలేని పట్టణీకరణ, అభివృద్ధి లేకపోవడం, పేదరికం వల్ల ఇలాంటి విపత్తులు మరింత ప్రమాదకరంగా మారుతాయన్నారు.