జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి సంచారం
బర్రెల మందపై పులి దాడి
భయాందోళనలో గ్రామస్తులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. కొద్ది రోజుల నుంచి పులి సంచరిస్తుండటంతో ప్రజలకు కంటివిూద కునుకులేకుండా పోతున్నది. తాజాగా కాటారం మండలం గుమ్మళ్ళపల్లి`వీరాపూర్ మధ్య అడవి ప్రాంతంలో చెరువు వద్ద మేతకు వెళ్లిన బర్రెల మందపై దాడి చేసి..రెండు బర్రెలను పులి చంపినట్లు బర్ల కాపరి ఓదెలు తెలిపాడు. భయభ్రాంతులకు గురైన ఓదెలు గ్రామానికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు సంఘటన స్థలానికి బయల్దేరారు. అయితే సోమవారం కూడా పులి లేగదూడపై దాడి చేసి చంపేసింది. సవిూప అడవి ప్రాంతంలోనే బర్లపై మళ్లీ దాడి చేయడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.