‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ఎన్టీఆర్‌ పోస్టర్‌ విడుదల

‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ఎన్టీఆర్‌ పోస్టర్‌ విడుదల

వైరల్‌ అవుతోన్న లుక్‌

యంగ్‌ టైగర్‌ యన్టీఆర్‌, మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన క్రేజీ మల్టీస్టారర్‌ ’ఆర్‌.ఆర్‌.ఆర్‌’. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ పాన్‌ ఇండియా మూవీ.. వచ్చే ఏడాది జనవరి 7న గ్రాండ్‌ గా రిలీజ్‌ కాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్స్‌, సింగిల్స్‌ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాయి. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా ట్రైలర్‌ ను ఈ నెల 9న  విడుదల చేస్తున్నారు. ఇంతకు ముందు విడుదలైన కొన్ని సెకండ్స్‌ టీజర్‌ లోని విజువల్స్‌ చూసే అభిమానులు మెస్మరైజ్‌ అయ్యారు. ఇక ట్రైలర్‌ ను చూస్తే ఆగుతారా?  వారి ఉత్సాహానికి, ఆత్రుతకి అడ్డుకట్ట వేయడం కష్టం. మరో మూడు రోజుల్లో ట్రైలర్‌ ట్రీట్‌ రాబోతోంది. ఈ సందర్భంగా మేకర్స్‌.. తారక్‌ ’భీమ్‌’ పాత్రకు సంబంధించిన ఓ కొత్త పోస్టర్‌ ను విడుదల చేశారు.

అందులో తారక్‌ పులిలా కనిపిస్తున్నాడు. తాళ్ళతో కట్టేసి ఉండగా.. రక్తమోడుతూ రౌద్రరూపంలో ఉన్న ’భీమ్‌’ అభిమానులకు తెగ నచ్చేశాడు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ వైరల్‌ అవుతోంది. తారక్‌, రామ్‌ చరణ్‌ల నెవర్‌ బిఫోర్‌ అవతారం చూడాలని అభిమానులు ఇప్పటి నుంచే ఆరట పడుతున్నారు. సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అనే ఆత్రుతతో ఉన్నారు. డివీవీ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ బ్యానర్‌ పై డివివి దానయ్య నిర్మిస్తోన్న ’ఆర్‌.ఆర్‌.ఆర్‌’ చిత్రం ఏ రేంజ్‌  లో భారీ సక్సెస్‌ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.