శివకార్తికేయన్‌కు జోడీగా రీతూవర్మ

‘జాతి రత్నాలు’తో ఆకట్టుకున్న దర్శకుడు అనుదీప్‌. తన రెండో సినిమా కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తమిళ కథానాయకుడు శివకార్తికేయన్‌ కోసం ఓ కథ సిద్ధం చేశారాయన. అది శివ కార్తికేయన్‌కీ బాగా నచ్చేసింది. వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ కూడా ఇచ్చారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని రూపొంది స్తున్నారు. ఇందులో కథానాయికగా రీతూ వర్మని ఎంచుకున్నట్టు సమాచారం. రీతూకి తమిళంలోనూ మంచి ఇమేజ్‌ ఉంది. అందుకే.. తనకి ఈ ఛాన్స్‌ వచ్చింది. తమిళంలో శివ కార్తికేయన్‌ పెద్ద స్టార్‌. తెలుగులోనూ ఆయన సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇటీవల విడుదలైన ’డాక్టర్‌’ తెలుగులో మంచి వసూళ్లు అందుకుంది. శివ కార్తికేయన్‌ సినిమా, పైగా జాతిరత్నాలు దర్శకుడి ప్రాజెక్టు. కాబట్టి కచ్చితంగా అందరి దృష్టీ ఈసినిమాపై పడుతుంది. ఎలాచూసుకున్నా.. రీతూకి ఇది లక్కీ ఛాన్సే.