‘హరిహర వీరమల్లు’లో నర్గీస్ ఫక్రీ ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్ లో ప్రస్తుతం సెట్స్ విూదున్న భారీ జానపద చిత్రం ’హరిహర వీరమల్లు’.ఈ మూవీ తాజా షెడ్యూల్ వచ్చేఏడాది జనవరి నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో నిధి అగర్వాల్ ప్రధాన కథానాయికగా నటిస్తుండగా.. మరో హీరోయిన్‌గా జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ను ఎంపిక చేశారు. అయితే ప్రస్తుతం ఆమె ఒక కేసులో ఇరుక్కుంది. దాన్ని పరిష్కరించుకోవడానికి ఈడీ ఆఫీస్ చుట్టూ తిరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఆమె షూటింగ్స్ లో పాల్గొనే అవకాశం లేకపోవడంతో.. జాక్వెలిన్ స్థానంలో మరో బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీని ఎంపిక చేయబోతున్నారట.
ప్రస్తుతం నర్గీస్‌తో క్రిష్ సంప్రదింపులు జరుపుతున్నారట. నిజానికి నర్గీస్ ను టాలీవుడ్ కు పరిచయం చేయాలని చాలా మంది దర్శక, నిర్మాతలు అనుకున్నారు. కానీ వర్కవుట్ కాలేదు. అలాగే.. పుష్పలో ఐటెమ్ సాంగ్ ను నర్గీస్ తో అనుకున్నారట సుకుమార్. కానీ అనూహ్యంగా సమంతా సీన్ లోకి వచ్చింది. ఏదైతేనేం ఇప్పుడు నర్గీస్ ఏకంగా పవర్ స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషమని చెప్పాలి. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో చూడాలి.