‘ఇండియన్‌ 2’లో తమన్నా ?

కమల్‌ హాసన్‌, శంకర్‌ కాంబినేషన్‌ లో తెరకెక్కిన క్రేజీ ప్రాజెక్ట్‌ భారతీయుడు. ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర భారీ విజయం సాధించడంతో దీనికి సీక్వెల్‌గా భారతీయుడు 2 స్టార్ట్‌ చేశారు. సినిమా సెట్స్‌పైకి వెళ్లినప్పటినుంచి ఏదో ఒక రూపంలో అవాంతరాలు వచ్చి పడుతున్నాయి. దీంతో సినిమా షూటింగ్‌ నిలిచిపోయింది. సెట్‌లో ప్రమాదం, లైకాతో వివాదాల వలన సినిమాకు బ్రేకుల పడ్డాయి.

ఇప్పుడు అన్ని సమస్యలు పక్కకు తొలగినట్టు కనిపిసత్తుండగా, త్వరలోనే ఇండియన్‌ 2 సినిమాని తిరిగి ప్రారంభించనున్నారు. అయితే ఈ సినిమాలో ముందుగా కాజల్‌ని కథానాయికగా అనుకున్నారు. పలు కారణాల వలన ఆమె తప్పుకుంది. కాజల్‌ స్థానంలో వర్షం బ్యూటీ త్రిషను తీసుకోనున్నట్లు కూడా ప్రచారం జోరుగా సాగింది. కాని ఇప్పుడు మిల్క్‌ బ్యూటీ తమన్నా పేరు తెరపైకి వచ్చింది.

’ఇండియన్‌ 2’లో హీరోయిన్‌గా, వయసు మళ్లిన పాత్రలో కనిపించాల్సి ఉంది. తమన్నా ఈ రెండు పాత్రలకు న్యాయం చేస్తారని చిత్ర బృందం భావించదట. దీంతో తమన్నాని చిత్ర బృందం ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. తమన్నా ఇప్పుడు కుర్ర హీరోలతో పాటు సీనియర్‌ హీరోలతో వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. భోళా శంకర్‌ చిత్రంలో చిరంజీవి సరసన తమన్నా కథానాయికగా ఎంపికైన విషయం తెలిసిందే.