కొహ్లీ మరో అరుదైన రికార్డు సొంతం

మూడు ఫార్మాట్లలో 50 మ్యాచ్‌లు గెలిచిన కెప్ట్‌న్‌

టీమిండియా సారథి విరాట్‌ కొహ్లీ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. క్రికెట్‌లోని ప్రస్తుత మూడు ఫార్మాట్లలో 50 మ్యాచ్‌లు గెలిచిన మొదటి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. భారత్‌ క్రికెట్‌ జట్టు సోమవారం న్యూజీలాండ్‌ను రెండో టెస్టులో 372 పరుగుల భారీ తేడాతో ఓడిరచింది. దీంతో భారత్‌ 2 టెస్టు మ్యాచుల సీరీస్‌ను 1`0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ గెలుపుతో కొహ్లీ తన కెరీర్‌లో 50 టెస్టు మ్యాచ్‌లలో విజయం సాధించిన ఏకైక ఆటగాడిగా అరుదైన రికార్డు నమోదు చేశాడు. టి20, వన్డే, టెస్టు ఫార్ల్మాట్లలో ఈ ఘనత సాధించిన కొహ్లీకి చేరువలో ఆస్టేల్రియా దిగ్గజం రికీ పాంటింగ్‌, భారత మాజీ కెప్టెన్‌ ధోనీ ఉన్నారు. రికీ పాంటింగ్‌ టెస్టు మ్యాచ్‌లలో అందరి కంటే ఎక్కువగా 108 మ్యాచ్‌లు, వన్డేలలో 262 మ్యాచ్‌లు గెలవగా.. టి20లలో మాత్రం ఏడు విజయాలనే అందుకున్నాడు. భారత్‌ మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ సైతం టెస్టులలో 36 విజయాలనే అందుకోగా.. వన్డేలలో మాత్రం 205, టి20లలో 57 మ్యాచ్‌లు గెలిచాడు.మరోవైపు కొహ్లీ టెస్టులలో 50 మ్యాచ్‌లు, వన్డేలలో 153, టి20 ఫార్మాటలో 59 విజయాలు సాధించాడు. దీంతో కొహ్లీ మూడు ఫార్మాట్లలో 50 విజయాలను అందుకున్న తొలి ఆటగాడిగా కీర్తికెక్కాడు