మేటి బౌలర్ల జాబితాలో అశ్విన్‌

హర్భజన్‌ సింగ్‌, అనిల్‌ కుంబ్లేలను దాటేసి రికార్డు

స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఇండియన్‌ మేటి బౌలర్ల జాబితాలో చేరాడు. హర్భజన్‌ సింగ్‌, అనిల్‌ కుంబ్లేలను అశ్విన్‌ దాటేశాడు. ఒకే ఏడాదిలో టెస్టుల్లో 50 వికెట్ల కన్నా ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అశ్విన్‌ కొత్త రికార్డు సృష్టించాడు. అశ్విన్‌ తన కెరీర్‌లో టెస్టుల్లో 50 వికెట్లు తీయడం ఇది నాలుగోసారి. న్యూజిలాండ్‌తో ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో అశ్విన్‌ మొత్తం 8 వికెట్లు తీశాడు. అయితే గతంలో కుంబ్లే, హర్భజన్‌లు మూడుసార్లు ఓ ఏడాదిలో 50 కన్నా ఎక్కువ టెస్టు వికెట్లు తీశారు. అశ్విన్‌ వారిని అధిగమించేశాడు. నాలుగోసారి ఒకే ఏడాదిలో 50 కన్నా ఎక్కువ వికెట్లు తీశాడు. 2015, 2016, 2017, 2021లో అశ్విన్‌ ఆ ఘనత సాధించాడు. 1999, 2004, 2006లో కుంబ్లే, 2001, 2002, 2008లో హర్భజన్‌, 1979, 1983లో కపిల్‌ దేవ్‌లు 50 వికెట్లు తీసుకున్నారు. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 14 వికెట్లు తీసి, 70 రన్స్‌ చేసిన అశ్విన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు దక్కింది.