ఐసిసి టెస్ట్‌ ర్యాంకింగ్‌లో కోహ్లీ సేనకు తొలి ర్యాంక్‌

ముంబై టెస్ట్‌ విజయంతో ర్యాంకింగ్‌లో ముందంజ

ఐసీసీ మెన్స్‌ టెస్ట్‌ టీమ్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఫస్ట్‌ నిలిచింది. న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌ను 1`0 తేడాతో కైవసం చేసుకున్న కోహ్లీసేన.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మళ్లీ తొలి స్థానాన్ని సొంతం చేసుకున్నది. తాజా సిరీస్‌ విక్టరీతో రేటింగ్‌లో ఇండియా 124 పాయింట్లు సాధించగా.. రెండవ స్థానంలో 121 పాయింట్లతో న్యూజిలాండ్‌ ఉంది. నిజానికి ఇటీవల ముగిసిన వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌లోనూ ఈ రెండు జట్లే ్గªనైల్లో తలపడిన విషయం తెలిసిందే. అయితే టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ ్గªనైల్లో ఓడిన ఇండియా.. తాజాగా కివీస్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌ను చేజిక్కించుకున్నది. దీంతో మళ్లీ ఇండియా ర్యాంకింగ్‌ మెరుగైంది. ఆ తర్వాత ర్యాంకుల్లో ఆస్టేల్రియా(108), ఇంగ్లండ్‌(107), పాకిస్థాన్‌(92) జట్లు ఉన్నాయి. ఇక 2021`2023 టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో ఇండియా 42 పాయింట్లు సాధించింది. ఇండియన్‌ టీమ్‌ స్వంత గడ్డపై టెస్ట్‌ సిరీస్‌ను గెలవడం వరుసగా ఇది 14వ సారి కావడం విశేషం.