తాపీ మేస్త్రిలుగా, కూలీ లు గా విఆర్ఏ లు..!

– విఆర్‌ఎలను తాపీ మేస్త్రిలుగా మార్చిన రెవెన్యూ అధికారులు
– రెవెన్యూ అధికారి కారు తుడవలేక కుమిలిపోతున్న విఆర్‌ఏలు
గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి రెవిన్యూ విధులు నిర్వర్తించవలసిన వి ఆర్ ఏ లు తాపీ మేస్త్రిలుగా, కూలివాళ్ళలాగ మార్చేసారు ఆత్మకూరు ఎస్ మండలం రెవిన్యూ అధికారులు. మద్దిరాల లోని కే జి బి వి స్కూల్ లో చెట్లు కొట్టాలని, రెవిన్యూ విధులు చెప్పకుండా మద్దిరాల కేజిబివి బడిలో చెత్త తొలగించాలని, గ్రౌండ్ శుభ్రం చెయ్యాలని వి ఆర్ ఏ లకు పనులు చెబుతున్నారని తెలుస్తోంది. రెవెన్యూ అధికారి కారును, కుర్చీలను ప్రతిరోజు బెదిరించి తుడిపించుకుంటున్నట్లు విఆర్‌ఎలు చెబుతున్నారు. స్టాఫ్ తక్కువగా ఉన్నారనే వంకతో 10 మంది కి పైగా వి ఆర్ ఏ లను డిప్యూటీషన్ తెచ్చుకొని వి ఆర్ ఏల చేత మేస్త్రి పనులు చేయించుకుంటున్న రెవెన్యూ అధికారులు.
కలెక్టర్ ఆర్డర్ ఉన్నా కారుణ్య నియామకం క్రింద ఉద్యోగం ఇవ్వకుండా నెలల కొద్దీ బాధితుణ్ణి తిప్పించుకుంటున్న చెబుతున్నారు. బాసీజం, నిరంకుశత్వం తో వి ఆర్ ఏ ల గోసబు చ్చు కుంటున్న రెవెన్యూ అధికారి పై చర్యలు తీసుకోవాలని, కలెక్టర్, ఆర్‌డిఓ లు స్పందించి విఆర్‌ఏ లను వెట్టి చాకిరి నుండి తప్పించాలని కోరుతున్నారు.