Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఒమిక్రాన్‌ తీవ్రమైనదా….!!

మళ్లీ లాక్‌ డౌన్‌ విధించేనా?
ప్రజల్లో ఇదే ఆందోళన
మొన్నటి వరకు ప్రపంచ దేశాలను కరోనా వైరస్‌ మహమ్మారి వైరస్‌ వణికించింది. ఆ మహమ్మారి ప్రభావం కాస్త తగ్గుముఖం పట్టింది అనుకుంటున్న సమయంలోనే అకస్మాత్తుగా డెల్టా వైరస్‌ విజృంభించింది. కర్ణాటకలో శరవేగంగా డెల్టా వైరస్‌ విజృంభించడంతో ప్రపంచదేశాలు అల్లాడి పోయాయి ఇక ఆ భయం నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న సమయంలో అకస్మాత్తుగా దక్షిణాఫ్రికా లో ఒమిక్రాన్‌ వైరస్‌ ప్రభావం పెరిగిపోయింది. ఆ దేశం నుంచి ప్రపంచ దేశాలకు ఈ వైరస్‌ మహమ్మారి తన ప్రతాపం చూపిస్తోంది. డెల్టా వేరియంట్‌ కంటే ఆరు రెట్ల వేగంతో ఈ ఒమిక్రాన్‌ వైరస్‌ విజృంభిస్తుండడంతో మరోసారి ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేగుతోంది. ఇప్పటికే ప్రపంచ దేశాలు ఈ వైరస్‌ విషయంలో అప్రమత్తమయ్యాయి.

అంతర్జాతీయ ప్రయాణికులపై అనేక ఆంక్షలు విధించాయి. అలాగే కొన్ని దేశాలకు రాకపోకలు నిషేధించాయి. పౌరులు , ప్రవాసులు ఎవరు దేశం దాటి వెళ్లొద్దని సూచనలు చాలా దేశాలు చేశాయి. ఈ మహమ్మారి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండడంతో అన్ని దేశాలు అప్రమత్తం అవుతున్నాయి. కొన్ని దేశాల్లో ఇప్పటికీ లాక్‌ డౌన్‌ అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌ లో లాక్‌ డౌన్‌ విధించే విషయంపై చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఈ ఒమిక్రాన్‌ వైరస్‌ భారత్‌ లోనూ అడుగు పెట్టింది. భారత్‌ లో 4 కేసులు నమోదు అయ్యాయి.

కర్ణాటకలోని బెంగళూరు ఎయిర్‌ పోర్ట్‌ కు నవంబర్‌ 11న ఒకరు, నవంబర్‌ 20 న మరొకరు ఒమిక్రాన్‌ సోకిన దేశాల నుంచి వచ్చారు అయితే వారికి వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ టాక్‌ రావడంతో వారిని ఐసోలేషన్‌ లో పెట్టారు. అలాగే మహారాష్ట్రలో నూ ఓ కేసు నమోదయింది. తెలంగాణకు వచ్చిన ఓ మహిళకు పాజిటివ్‌ గా తేలడంతో ఆమెకు ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. ఇప్పుడు భారత్‌ లో ఈ వైరస్‌ మరింత విజృంభించే అవకాశం ఉన్న నేపథ్యంలో లాక్‌ డౌన్‌ విధింపు అంశం పై చర్చ జరుగుతోంది. గతంలో కరోనా వైరస్‌ సమయంలో విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా భారత్‌ ఆర్థికంగా ఎంతో నష్టపోయింది. అన్ని వర్గాల ప్రజలు ఈ లాక్‌ డౌన్‌ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పటికే అనేక ఆంక్షలను భారత్‌ లో విధించారు. అయితే ఇప్పుడు ఈ కొత్త వేరియంట్‌ ను ఎదుర్కునేందుకు లాక్‌ డౌన్‌ ఒక్కటే మార్గమా లేక మరేదైనా ప్రత్యామ్నాయం ఆలోచిస్తారా అనేది తేలాల్సి ఉంది.