Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

గ్రామాల లక్ష్యంగా అభివృద్ది సాగాలి

కార్యక్రమాల అమలులో పోటీతత్వం రావాలి

గ్రావిూణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఇరు తెలుగు రాష్టాల్ల్రో అమలవుతున్న కార్యక్రమాలకు కేంద్రం చేయూతను ఇవ్వాల్సి ఉంది. ఇచ్చిన హావిూల మేరకు నిధుల విడుదల జరిగితే సమస్యలకు పరిష్కారం దక్కగలదు. అయినా ఇరుష్టాల్ల్రో  చేస్తున్న కృషి మాత్రం అభినందనీయం. గ్రామాలను పరిపుష్టం చేసే దిశగా అనేక కార్యక్రమాలు సాగుతున్న తీరు ఇరత రాష్టాల్రకు ఆదర్శం కావాలి.

సీఎంలు ఇద్దరూ  బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలపై వరాల జల్లు కురిపిస్తున్న తీరు వారిని మచ్చిక చేసుకోవడానికే అన్న విమర్శలు సరికాదు. వారి బతుకులు బాగుచేయడానికి సకల ప్రయత్నాలు చేస్తున్న తీరుగా చూడాలి. ఎక్కడా విలువలు తప్పకుండా, పారదర్శకత విస్మరించకుండా అనేక పథకాలు సాగుతున్నాయి.

బీళ్లు బారిన తెలంగాణ భూములను సస్యశ్యామలం చేయాలన్న సంకల్పంతో, గొంతెం డుతున్న జనం కష్టాలను తీర్చాలన్న సంకల్పంతో ప్రారంభించిన పథకాలు. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ. ఈ పథకాల్లో అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకు వచ్చే నిధులకు సమానంగా ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకు అందుతున్నాయి. అంతటా ఒకేవిధమైన అభివృద్ధి సాగుతుంది. అంతటా గొలుసుకట్టు చెరువులన్నీ వరుసకట్టి అలుగుపోస్తున్నాయి.  వివిధ పథకాలు సమర్థవంతంగా అమలుచేయడానికి ఎలాంటి చర్యలైనా తీసుకునే అధికారం, స్వేచ్ఛను జిల్లా కలెక్టర్లకు ఇస్తున్నట్లు సీఎం కెసిఆర్‌ ప్రకటించారు.

ఇలా గ్రామాలను ఆధారం చేసుకుని కార్యక్రమాలు చేస్తేనే అభివృద్ది సాధ్యం. అందుకు తెలుగు రాష్టాల్రు ఆదర్శంగా మారితే అంతకు మించిన భాగ్యం మరోటి లేదు. కార్యక్రమాలు ఏవైనా, పేర్లు ఏవైనా ఇరురాష్టాల్ల్రో ఇంచుమించుగా అభివృద్ది కార్యక్రమాలు సాగుతున్నాయి. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, కులవృత్తులకు చేయూత,నీటి సంరక్షణ కార్యక్రమాలు జోరుగా సాగు తున్నాయి. అలాగే వ్యవసాయ పరిరిక్షణ ఉద్యమం కూడా సాగుతోంది. తెలంగాణలో కులవృత్తును బలోపేతం చేయడం అన్నది గ్రావిూణ అర్థిక వ్యవస్థను బలోపేతం చేసేదిగా గమనించాలి.

పరిశ్రమల పేరుతో పర్యావరణాన్ని నాశనం చేసుకునే కన్నా మన వ్యవసాయ పరిశ్రమను బాగు చేసుకోవడం మంచిది. తెలంగాణలో నీటి లభ్యత తక్కువ. తాగడానికే నీళ్లు లేవు. ఇక సాగునీరు సంగతి సరేసరి. ఈ రెండు లక్ష్యాల కోసం తెలంగాణలో మిషన్‌ కాకతీయ,మిషన్‌ భగీరత కార్యక్రమాలు చేపట్టారు. వీటి ఫలాలను ప్రజలు అందుకుంటున్నారు. ఇంటింటికి మంచినీళ్లు ఇస్తుంటే అప్పులు చేస్తున్నారంటూ అడ్డగోలు ఆరోపణలు చేస్తున్న వారు గతంలో వేలకోట్లు దుబారా గురించి మాట్లాడడం లేదు.  ప్రాజెక్టులు కట్టి తెలంగాణ నేలంతా సస్యశ్యామలం చేస్తుంటే ప్రాజెక్టులను రీడిజైన్‌ చేస్తున్నారని అవాకులు, చెవాకులు పేలుతున్నారు. కానీ ఇప్పుడు అలా కాకుండా క్షేత్రస్థాయిలో పనులు జరుగుతున్నాయి.

ప్రధానంగా చెరువుల పునరుద్దరణ అన్నది పెద్ద ఎత్తున ఇరు రాష్టాల్ల్రో సాగుతోంది. వ్యవసాయానికి పెద్ద ఎత్తున కృషి జరుగుతోంది. అందుకే కంది,మిర్చి, పసుపు పంటల దిగుబడి పెరిగింది. వరి ధాన్యం దిగుబడులు పెరిగాయి. ఇవన్నీ అభివృద్ది కోణంలోనే చూడాలి. ధరలు దక్కకపోవడం, కొనుగోళ్లు లేకపోవడం అన్నది వేరు సమస్య.  అలాంటి ఆరోగ్యకర వాతావరణం ఇప్పుడు తెలుగునేలపై సాగుతోంది. తిపక్షనాయకులుగా రోజూ విమర్శించే వారితో పాటు ప్రభుత్వాన్ని నిత్యం విమర్శించే ఇతర పార్టీల ఎమ్మెల్యేలు అందరూ తమ నియోజకవర్గాల్లో సాగుతున్న కార్యక్రమాల్లో భాగస్వాములుగా ఉన్నారు. ఇలాంటి అసమానతలు లేని విధానాన్ని రూపొందించడం వల్లనే గ్రామాలు అభివృద్ది చెందుతాయి.