భారతీయులు అత్యంత ప్రతిభా సంపన్నులు

యువశక్తి సామర్థ్యాలపై ప్రపంచ ప్రముఖుల ప్రశంసలు
టెస్లా సీఈవో ఎలన్ మస్క్ అభినందనలు
భారతీయ యువత శక్తిసామర్ద్యాలపై ప్రపంచ మేటి వ్యాపార దిగ్గజాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ట్విట్టర్ సంస్థ ఈసీవోగా భారత్‌కు చెందిన పరాగ్ అగర్వాల్‌ను నియమించింది. దీనిపై టెస్లా సీఈవో ఎలన్ మస్క్ స్పందించారు. ప్రతిభావంతులైన భారతీయుల వల్ల అమెరికా లబ్ది పొందుతున్నట్లు మస్క్ ట్వీట్ చేశారు. ట్విట్టర్ సీఈవో పరాగ్ నియామకాన్ని స్వాగతిస్తూ..
లాస్ ఏంజిల్స్‌కు చెందిన స్టైప్ర్ కంపెనీ సీఈవో ప్యాట్రిక్ కొలిసన్ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఆయన భారతీయుల ట్యాలెంట్‌ను మెచ్చుకున్నారు. గూగుల్, మైక్రోసాప్ట్, అడోబ్, ఐబీఎం, పాలో ఆల్టో నెట్వర్క్స్, ఇప్పుడు ట్విట్టర్ సీఈవో లు అందరూ ఇండియాలో పుట్టి, పెరిగినవాళ్లే అని, టెక్నాలజీ ప్రపంచంలో భారతీయులు అమోఘమైన విజయాన్ని సాధించడం అద్భుతంగా ఉందని ఆయన అన్నారు. ఇమ్మిగ్రాంట్లకు అమెరికా ఇస్తున్న అవకాశాలు సద్వినియోగం అవుతున్నట్లు తన ట్వీట్లో ప్యాట్రిక్ తెలిపారు. అయితే ఆ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ మస్క్ దానిపై కామెంట్ చేశారు.
గూగూల్ సీఈవోగా సుందర్ పిచాయ్, మైక్రోసాప్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ సోషల్ విూడియా దిగ్గజం ట్విట్టర్.. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా భారత సంతతి టెక్కీ పరాగ్ అగర్వాల్ నియామకమైన సంగతి తెలిసిందే. సీఈవోగా ఉన్న ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే సోమవారం పదవీ నుంచి దిగిపోవడంతో ఆయన స్థానంలో చీఫ్ టెక్నికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న పరాగ్ అగర్వాల్‌ను సంస్థ బోర్డు ఏకగ్రీవంగా నియమించింది. 2006 నుంచి డోర్సే ట్విట్టర్ సారథిగా కొనసాగుతూ వస్తున్నారు. అయితే.. ట్విట్టర్ సీఈఓగా భారత వ్యక్తిని నియమించడంపై టెస్లా బిలియనీర్ ఎలోన్ మస్క్ స్పందించారు. ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు.
భారతీయ ప్రతిభ నుంచి అమెరికా చాలా ప్రయోజనం పొందింది అంటూ అని టెస్లా బాస్ మస్క్ ట్వీట్ చేశారు. గూగుల్, మైక్రోసాప్ట్, అడోబ్, ఐబిఎమ్ వంటి ప్రపంచంలోని అగశ్రేణి టెక్ కంపెనీలకు నాయకత్వం వహిస్తున్న భారతీయ సంతతి వ్యక్తులపై పాట్రిక్ కొల్లిసన్ చేసిన ఓ ట్వీట్‌కు ఆయన సమాధానమిచ్చారు. గూగుల్`పెరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ అఇక్షగా సుందర్ పిచాయ్, మైక్రోసాప్ట్ అఇక్షగా సత్య నాదెళ్ల సేవలందిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. అలాంటి ప్రముఖ ఙా టెక్ సంస్థకు నాయకత్వం వహించనున్న పరాగ్ అగర్వాల్ కూడా అత్యంత ప్రతిభావంతుడని కొనియాడారు. కాగా.. ఎలన్ మస్క్ ట్విట్‌పై చాలామంది స్పందిస్తూ రీట్విట్ చేస్తున్నారు. వారంతా అత్యంత ప్రతిభావంతులని కొనియాడుతున్నారు. ఇప్పటికే గూగుల్ సీఈఓగా సుందర్ పిచాయ్, మైక్రోసాప్ట్ సీఈఓగా సత్య నాదెళ్ల, అడోబ్ సీఈఓగా శాంతను నారాయణ్, ఐబీఎంకు అరవింద్ కృష్ణ నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వారి సరసన పరాగ్ అగర్వాల్ చేరారు. అగర్వాల్ 2011లో కంపెనీలో చేరారు. అక్టోబర్ 2017 నుంచి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా పనిచేశారు.