యవనిక పై రెపరెపలాడుతున్న భారత కీర్తిపతాక !

పరాగ్ అగర్వాల్..ఈ పేరు ఇప్పుడే …తాజాగానే మనకు తెలుసు. కానీ అమెరికన్లకు ఎప్పటినుంచో తెలుసు. కృషి పట్టుదలతో ఆయన ఇప్పుడు ట్విట్టర్ సిఇవో నియమితులు కావడం దేశం గర్వంగా తలెత్తుకునేలా చేసాడు. అంతకుముందు ఇలా ఎందరో మన కీర్తిపతాకను ఎగురేశారు. ఇలా భారతీయ మేధస్సుకు ప్రపంచం సలాం చేస్తోంది. రంగం ఏదైనా కష్టపడే తత్వం, ఆలోచించే విధానం, నైపుణ్యం సాధించే విషయంలో మనవారిని మించిన వారు లేరని మరోమారు రుజువు చేసారు. అనేక రంగాల్లో అనేక విజయా లు సొంతం చేసుకున్న ఘనత మన భారతీయలదే అనడంలో సందేహం లేదు. తాజాగా ట్విట్టర్ సిఇవోగా భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ నియమితులు కావడం..భారతీయుల మేధస్సు అమోఘం అంటూ ఆయనపై ప్రశంసలు కురవడం..మనకంతా గర్వకారణం.
ఒకప్పుడు ఎంతో మేధస్సుతో ఎన్నో రంగాల్లో ఎంతో ప్రగతి సాధించిన భారతీయులు తమకు అవకాశం వస్తే ఎంతటి పనైనా చేసి చూపుతారని నిరూపిం చారు. మన చరిత్ర తిరగేస్తే ఏరంగం అయినా మనదే పైచేయిగా ఉండేది. కంప్యూటర్ యుగంలో ప్రస్తుత ప్రపంచం టెక్నాలజీ ఆధారంగానే నడుస్తున్న తరుణంలో భారతీయ మేధావులు అమోఘమైన ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. టెక్ సామ్రాజ్యాన్ని భారతీయులు ఏలుతున్నారు. ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ నుంచి సోషల్ విూడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ వరకు దిగ్గజ కంపెనీలకు సీఈవోగా వెలుగొందుతున్న వారంతా భారతీ యులు కావడం దేశ ప్రతిష్టను ఇనుమడిరప చేసేదిగా చూడాలి. తమ ప్రతిభతో దేశ ఖ్యాతిని ప్రపంచ దేశాల కు వ్యాపింపజేస్తున్నారు. సత్య నాదెళ్ల, శాంతను నారాయణ్, సుందర్ పిచాయ్, అరవింద్ కృష్ణ, ఇప్పుడు పరాగ్ అగర్వాల్.. ఇలా భారతీయులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ ఐటీ కంపెనీలకు సీఈవోగాలు రాణిస్తూ.. దేశ ఖ్యాతిని మరింత పెంచుతున్నారు.
ప్రపంచానికి తమ జ్ఞానాన్ని అందిస్తూ.. తమదైన ముద్ర వేస్తున్నారు. వీరంతా ఇలా ముందుకు సాగడం భారతీయులుగా మనందరికీ గర్వకారణంగా భావించాలి. ఇప్పటికే గూగుల్, ఆల్ఫాబెట్, మైక్రోసాప్ట్, ఐబిఎం, అడోబ్ సీఈవోలుగా భారతీయులు ఉండగా.. ఇప్పుడు ఆ జాబితాలో మరో దిగ్గజ కంపెనీ చేరింది. సోషల్ విూడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ సీఈవోగా భారతీయుడైన పరాగ్ అగర్వాల్ ఎంపికయ్యాడు. దాంతో దేశ ఖ్యాతి మరింత ఇనుమడిరచింది. సత్య నాదెళ్ల ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందిన మైక్రోసాప్ట్ సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా 2014 ఫిబ్రవరి 4న నియమితులయ్యారు. అంతకుముందు ఆయన మైక్రోసాప్ట్‌లో క్లౌడ్ అండ్ ఎంటర్‌ప్రైజెస్ విభాగానికి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.1976 నుండి సంస్థ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, స్టీవ్ బాల్మేర్ తర్వాత మూడవ సిఇఓగా సత్య నాదెళ్ల బాధ్యతలు చేపట్టాడు. సత్య నాదెళ్ల స్వస్థలం..అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం,బుక్కాపురం గ్రామం.
సుందర్ పిచాయ్.. భారత దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన అద్భుత మేధావే కాదు..టెక్ దిగ్గజంగా చెప్పుకోవాలి. తన అకుంఠిత శ్రమ, చిత్తశుద్ధితో ప్రపంచానికి తానేంటో నిరూపించి చూపిన వ్యక్తి. దక్షిణ భారతదేశం నుంచి మొదలైన ఆయన ప్రయాణం.. అమెరికా వరకు దిగ్విజయంగా సాగుతోంది. అంచెలంచెలుగా ఎదిగిన సుందర్ పిచాయ్.. 2015 లో గూగుల్ సీఈఓగా ఎంపికయ్యారు. ఇక 2019లో గూగుల్ మాతృ సంస్థ అయిన ఆల్ఫాబెట్ సీఈఓగా కూడా బాధ్యతలు స్వీకరించారు. 1962లో భారత్‌లో జన్మించిన అరవింద్ కృష్ణ.. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతి కలిగిన ఐబిఎంకు బిజినెస్ ఎగ్జిక్యూటీవ్ చైర్మన్, సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 2020 నుంచి ఆయన సీఈవోగా ఉన్నారు. జనవరి 2021లో చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.
1990లో ఐబీఎంలో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన అరవింద్ కృష్ణ.. ఐబిఎం క్లౌడ్, కాగ్నిటివ్ సాప్ట్‌వేర్, ఐబిఎం రీసెర్చ్ విభాగాలను నిర్వహిస్తూ.. 2015లో సీనియర్ వైస్ ప్రెసెడెంట్‌గా పదోన్నతి పొందారు. కంపెనీ చరిత్రలో అతిపెద్ద కొనుగోలు అయిన రెడ్ హ్యాట్ కొనుగోలులో ఆయన పాత్ర కీలకం. పశ్చిమ గోదావరి జిల్లాలో అరవింద్ కృష్ణ జన్మించారు. భారతీయ అమెరికన్ వ్యాపార వేత్తగా శంతను నారాయణ్ ప్రత్యేక పేరును సంపాదించుకున్నారు. ప్రస్తుతం అడోబ్ కంపెనీకి సీఈవోగా విధులు నిర్వర్తిస్తున్న ఆయన..స్వస్థలం హైదరాబాద్. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగి, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్న నారాయణ్.. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎలక్టాన్రిక్స్‌లో బి.ఇ పూర్తి చేశారు. ఆ తరువాత అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బర్కిలీ లో ఎం.బి.ఏ పూర్తి చేశారు. ఓహయో లోని బౌలింగ్ గ్రీన్ స్టేట్ విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎస్ పూర్తి చేశారు.
శంతను 1998లో అడోబ్‌లో ఇంజనీరింగ్ టెక్నాలజీ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్‌గా చేరారు. ఆ తరువాత 2005లో ప్రెసిడెంట్, సీఒఒ బాధ్యతలు స్వీకరించారు. 2007లో సీఈవో, 2017లో బోర్డు ఛైర్మన్ అయ్యాడు. అంతే కాదు.. శంతను యుఎస్`ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరమ్‌కి వైస్ చైర్మన్, ఫైజర్ బోర్డులో మెంబర్ కూడా. ఆయన గతంలో డెల్ డైరెక్టర్‌గా పనిచేశాడు. యూఎస్ ప్రెసిడెంట్ మేనేజ్‌మెంట్ అడ్వైజరీ బోర్డులో మాజీ సభ్యుడు కూడా. ఇక అడోబ్‌లో చేరడానికి ముందు, శాంతను యాపిల్ , సిలికాన్ గ్రాఫిక్స్‌లో ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ పాత్రలను నిర్వహించి, ప్రారంభ ఫోటో`షేరింగ్ స్టార్టప్ పిక్టాన్రు సహ వ్యవస్థాపకుడుగా మార్చారు.
తాజాగా ప్రముఖ సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విటర్ సీఈవోగా భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. ట్విటర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే సీఈవో బాధ్యతల నుంచి తప్పు కొంటున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయన స్థానంలో పరాగ్ అగర్వాల్ కొత్త సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. సంస్థలో చేరిన పదేళ్ల కాలంలోనే పరాగ్ అగర్వాల్ ఈ అత్యున్నత పదవిని దక్కించుకోవడం విశేషం. భారత్‌కు చెందిన పరాగ్ అగర్వాల్ 2005లో బాంబే ఐఐటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ప్రఖ్యాత స్టాన్‌ఫోర్డ్ వర్సిటీలో 2011లో కంప్యూటర్ సైన్స్ విభాగంలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. పీహెచ్‌డీ చేస్తున్న సమయంలో మైక్రోసాప్ట్, ఏటీ అండ్ టీ ల్యాబ్స్, యాహూలలో రీసెర్చి చేశారు. 2011లో ట్విటర్‌లో సాప్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగంలో చేరిన పరాగ్ అగర్వాల్.. 2018లో ట్విటర్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా నియమితులయ్యారు. గత పదేళ్లుగా ట్విటర్‌లో పనిచేస్తున్న ఆయన.. ట్విటర్ టెక్నికల్ స్టేటజ్రీ, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో కంజ్యూమర్, రెవెన్యూ, సైన్స్ టీమ్స్‌ల బాధ్యతలు చూస్తున్నారు. వీరే కాకుండా సెకండ్ లెవల్ అధికారులుగా వందలాది మంది భారతీయులు వివిధ దేశాల్లో పనిచేస్తున్నారు. వారంతా తమ కంపెనీల్లో అద్బుతంగా రాణిస్తున్నారు.