రాజధానులపై ఎటూ తేల్చుకోలేని సర్కార్
మరో రెండున్నరేళ్లలో లక్ష్యం నేరవేరడం అసాధ్యం
ప్రజలకు డబ్బుల పంపిణీతో గుల్లవుతున్న బొక్కసం
మూడు రాజధానుల విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. హైకోర్టులో విచారణ సందర్బంగా బిల్లులు వెనక్కి తీసుకున్నా మళ్లీ సమగ్ర బిల్లుతో వస్తామని ప్రకటించడం ద్వారా తన లక్ష్యాన్నినెరవేర్చుకునే ప్రయత్నాలు మాత్రం వరమించడం లేదు. రాష్ట్రం ఏర్పడి ఏడున్నరేళ్లు అవుతున్నా ప్రభుత్వ నిర్వాకంతో రాజధాని అన్నది లేకుండా పోయింది. అమరావతిని గత ప్రభుత్కవం ప్రకటించి అంతోఇంతో పునది వేయడా దానిని ముందుకు తీసుకుని వెళ్లడంలో జగన్ విఫలమయ్యారు. దీంతో రాజధాని వ్యవహారం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. జగన్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తరవాత మూడు రాజధానుల అంశాన్ని తెర విూదకు తెచ్చారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట రెండేళ్లపాటు కాలయాపన చేవారు.
రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులను అత్యంత ఘోరంగా అవమానించారు. రాజధాని ప్రాంతంలో భారీ కుంభకోణం జరిగిందని ఊరూ వాడా ప్రచారం చేశారు. అక్కడ కుంభకోణం ఏవిూ జరగలేదని సుప్రీంకోర్టు తేల్చినా అదే ప్రచారం సాగుతోంది. అమరావతి రాజధాని కోసం రైతులు పాదయాత్ర చేస్తున్నా..అదో పెయిడ్ ఆర్టిస్టుల డ్రామాగా సాగుతున్నారు. ప్రభుత్వం ఆర్భాటంగా తెచ్చిన పాలనా వికేంద్రీకరణ బిల్లుపై హైకోర్టులో విచారణ మొదలైంది. మరోవైపు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ’న్యాయస్థానం టు దేవస్థానం’
పేరిట రైతులు మహా పాదయాత్ర చేపట్టారు. ఈ నేపథ్యంలో వికేంద్రీకరణ బిల్లును ఉపసంహరించు కుంటున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. రైతులు సంతోషపడేలోగానే, ఒకడుగు వెనక్కి వేయడమంటే రెండడుగులు ముందుకు వేయడమేనని మంత్రులు ప్రకటించారు. మరింత వివరంగా, స్పష్టంగా, అర్థవంతంగా కొత్త బిల్లును తీసుకురావడానికే పాత బిల్లును ఉపసంహరించుకుంటున్నట్టు
ముఖ్యమంత్రి జగన్ శాసనసభలో ప్రకటించారు. రాజధానిగా అమరావతిని కొనసాగించడం ఇష్టంలేని జగన్ మూడు రాజధానుల బిల్లును ఎప్పుడు, ఏ రూపంలో తెస్తారో, రాజధానులు ఎప్పుడు నిర్మిస్తారో తెలియని పరిస్థితి ఏర్పడిరది. జగన్‌కు మరో రెండున్నరేళ్ల వ్యవధి మాత్రమే అధికారంలో ఉండే అవకాశం ఉంది. ఇప్పటిదాకా రాజధాని నిర్మాణంపై ఒక్క అడుగు కూడా ముందుకు వేయని ప్రభుత్వం ఎప్పుడు బిల్లు తెస్తుంది? ఎప్పుడు నిర్మాణాలు చేపడుతుందన్నది స్పస్టత లేదు. రాజధానిని నిర్మించే సత్తా జగన్ ప్రభుత్వానికి లేదని స్పష్టమవుతోంది.
మూడు రాజధానుల బిల్లు లోపభూయిష్టంగా ఉందని ప్రభుత్వమే అంగీకరించి నందున రెండున్నరేళ్ల కాలం వృధా అయ్యింది. యాభైశాతానికి పైగా ఓట్లతో 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించినప్పటికీ అభివృద్ది నీరసించిందన్న విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను కేంద్ర ప్రభుత్వం కూడా చూసీచూడనట్టుగా ఉంటోంది. రాయలసీమ ప్రజలు కనీవినీ ఎరుగని వరదల్లో చిక్కుకుని అల్లాడుతుంటే వారిని కలిసి భరోసా ఇవ్వవలసిన ముఖ్యమంత్రి అలా చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. ఇసుక, సిమెంట్, ఇనుము ధరలు, కరెంటు చార్జీలు, బస్సు చార్జీలు, ఆస్తిపన్ను, నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయి. మరోవైపు కొత్తగా చెత్త పన్ను, వాహనపన్నులు, మద్యం ధరలు, కళాశాలల ఫీజులను పెంచుకుంటూ పోతున్నారు. సినిమా టికెట్ ధరలను మాత్రం నియంత్రించారు. త్వరలోనే విశాఖ కూడా హైదరాబాద్‌తో పోటీ పడుతుందని చెప్పడo ద్వారా విశాఖను రాజధాని చేయాలన్న సంకల్పంతో సిఎం జగన్ ఉన్నారు.
మూడు రాజధానులు అంటూ ఊదరగొట్టినా కర్నూలు, విశాఖపట్నంలో ఈ రెండున్నరేళ్లలో ఒక్కటంటే ఒక్క భవనాన్ని నిర్మించలేక పోయారు. మూడు రాజధానుల విషయం అటుంచి ఒక్క రాజధాని కూడా లేకుండాపోతుంది. రాష్ట్రం ఆర్థికాభివృద్ధి సాధిస్తే ప్రజలు కూడా అభివృద్ధి చెందుతారు. అమరావతిని కొనసాగించి ఉంటే ఇప్పటికే కొంద పురోగతి సాధించేది. అప్పులు చేసి డబ్బు పంచుతున్న క్రమంలో భవిష్యత్తులో ఆ అప్పులు తీర్చడం కోసం తమపైనే పన్నుల భారం పడుతుందని ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ భవిష్యత్ ఆదాయాన్ని, ప్రభుత్వ భవనాలను, ఇతర ఆస్తులను కుదువపెట్టి అప్పులు చేయడం ఎంతవరకు సమంజసమో చెప్పాలి.