ఆకట్టుకుంటున్న ‘బింబిసార’ టీజర్‌

నందమూరి కళ్యాణ్‌ రామ్‌ హీరోగా శ్రీ వశిష్ట్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న సోషియో ఫాంటసీ మూవీ ’బింబిసార’. యన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌ పై నిర్మాణం జరుపుకుంటోన్న ఈ సినిమా టైమ్‌ ట్రావెల్‌ మూవీగా రూపొందుతోంది. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా టీజర్‌ ను విడుదల చేశారు మేకర్స్‌. అద్భుతమైన విజువల్స్‌ తో.. టేకింగ్‌ తో రూపుదిద్దుకున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. బింబిసారగా కళ్యాణ్‌ రామ్‌ మేకోవర్‌ ఆకట్టుకుంటోంది. అలాగే.. ఆయన కదన రంగంలో కత్తి తిప్పే విజువల్స్‌ కూడా ఆకట్టుకుంటున్నాయి. లాస్ట్‌ ఇయర్‌ వచ్చిన ’ఎంత మంచివాడవురా’ సినిమా తర్వాత కళ్యాణ్‌ రామ్‌ నటిస్తున్న సినిమా ఇదే అవడం విశేషం.

’ఓ సమూహం తాలూకు ధైర్యాన్ని ఓ ఖడ్గం శాసిస్తే.. కొన్ని వందల రాజ్యాలు ఆ ఖడ్గానికి తలవంచి బానిసలైతే, ఇందరి భయాన్ని చూస్తూ పొగరుతో ఓ రాజ్యం విూసం మెలేసింది. అదే త్రిగర్తల సామ్రాజ్యపు నెత్తుటి సంతకం. బింబిసారుడి ఏకఛత్రాధిపత్యం’ అనే వాయిస్‌ తో ఆకట్టుకునే విజువల్స్‌ తో ఈ టీజర్‌ ను కట్‌ చేశారు. అలాగే.. ఈ టీజర్‌ చివరిలో కళ్యాణ్‌ రామ్‌ వర్తమానంలోని కేరక్టర్‌ ను కూడా రివీల్‌ చేశారు. ఆ మేకోవర్‌ కూడా ఆకట్టుకుంటోంది. ’మగధీర’ తరహాలో ఓ పవర్‌ ఫుల్‌ ఎª`లాష్‌ బ్యాక్‌ తో ఈ సినిమా తెరకెక్కిందని అర్ధమవుతోంది. మరి ఈ సినిమాతో కళ్యాణ్‌ రామ్‌ ఏ రేంజ్‌ హిట్‌ అందుకుంటారో చూడాలి.