ఇంటివాడు కాబోతున్న క్రికెటర్‌ శార్దూల్‌ ఠాకూర్‌

ప్రేయసి మిథాలీతో ఎంగేజ్‌మెంట్‌

ముంబై,నవంబర్‌29(ఆర్‌ఎన్‌ఎ): టీమిండియా పేసర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ పెళ్లి చేసుకోబోతున్నాడు. తన

చిరకాల ప్రేయసి మిథాలీ పారుల్కర్‌ను మనువాడబోతున్నాడు. అత్యంత సన్నిహితుల మధ్య ముంబైలో ఈ జంట ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నట్లు సమాచారం. ఆదివారం ఈ వేడుక జరిగినట్లు శార్దూల్‌ సన్నిహిత వర్గాలు వెల్లడిరచాయి. వచ్చే ఏడాది ఆస్టేల్రియా వేదికగా జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌ ముగిసిన తర్వాత వీరి వివాహం జరుగనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శార్దూల్‌ ఠాకూర్‌` మిథాలీ నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ విూడియాలో వైరల్‌ అవుతున్నాయి. టీమిండియా తరఫున ఇప్పటి వరకు 4 టెస్టులు, 15 వన్డేలు, 24 టీ20 మ్యాచ్‌లు ఆడిన శార్దూల్‌ ఠాకూర్‌.. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్‌`2021 సీజన్‌లో చెన్నై చాంపియన్‌గా అవతరించడంలో కీలక పాత్ర పోషించిన శార్దూల్‌… ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌`2021లో పాల్గొన్నాడు. ఇక ఫాల్ఘర్‌కు చెందిన శార్దూల్‌ ఠాకూర్‌ గత కొంతకాలంగా మిథాలీతో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది.