బైకు ప్రమాదంలో గాయపడ్డ షేన్‌ వార్న్‌

అతిపెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డ క్రికెటర్‌

ఆస్టేల్రియా మాజీ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ గాయపడ్డాడు. తన బైక్‌ నుంచి కింద పడ్డాడు. కుమారుడు జాక్సన్‌తో కలిసి బైక్‌ నడుపుతున్న సమయంలో వార్న్‌ రోడ్డుపై జారిపడ్డాడు. అయితే అతని బైక్‌ కనీసం 15 విూటర్ల దూరం ఈడ్చుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పెద్దగా గాయాలు కాలేదని తెలుస్తోంది. కానీ తీవ్ర నొప్పులతో వార్న్‌ బాధపడుతున్నాడు. కాలు, తొంటి ఎముకలు విరిగి ఉంటాయని తొలుత వార్న్‌ భయపడ్డాడు. కానీ హాస్పిటల్‌కు వెళ్లిను అతను క్షేమంగా ఉన్నట్లు తేలింది. 52 ఏళ్ల వార్న్‌ ఇప్పుడు కామెంటేటర్‌గా చేస్తున్నాడు. డిసెంబర్‌ 8వ తేదీ నుంచి ప్రారంభంకానున్న యాషెస్‌ సిరీస్‌కు కామెంటరీ ఇవ్వనున్నాడు. ఆసిస్‌  విూడియా నివేదికల ప్రకారం.. షేన్‌ వార్న్‌ మెల్‌బోర్న్‌లో రైడ్‌కు తన కూమారుడితో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే స్పోర్ట్స్‌ బైక్‌ను అతివేగంగా నడిపినందునే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రమాదంపై స్పందించిన షేన్‌ వార్న్‌  మాట్లాడూతూ.. ’నేను అదుపు తప్పి బైక్‌పై నుంచి కిందపడిపోయాను. ఆసమయంలోనేనే కాస్త బయపడ్డాను. స్పల్పగాయాలతో బయటపడ్డాను. అప్పుడు నేను బాగానే ఉన్నానని అనుకున్నాను. కానీ మరుసటి రోజుకి గాయం తీవ్రమైంది. దీంతో పూర్తిగా నడవలేకపోయాను. తర్వాత ఆసుపత్రికి వెళ్లగా నా కాలికి గాయమైందని వైద్యలు తెలిపారు. యాషెస్‌ సిరీస్‌లో భాగంగా గబ్బాలో జరిగే తొలి టెస్ట్‌కు నేను అక్కడే ఉంటాను’ అని వార్న్‌ పేర్కొన్నాడు. కాగా  ఆస్టేల్రియా తరపున 145 టెస్టులు ఆడిన షేన్‌ వార్న్‌ 708 వికెట్లు సాధించాడు.