నృత్య దర్శకుడు శివశంకర్‌ మాస్టర్ కన్నుమూత

ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్‌ మాస్టర్‌(72) కరోనాతో చికిత్స పొందుతూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆదివారం తుది శ్వాస విడిచారు. శివశంకర్‌ మాస్టర్‌ చెనైలో 7 డిసెంబర్‌ 1948లో పుట్టినారు. 1974లో మాస్టర్‌ సలీమ్‌ వద్ద సహాయ నృత్యదర్శకుడిగా పనిచేసిన ఆయన భారతీయ చిత్ర పరిశ్రమలోని 10 భాషల చిత్రాలకు నృత్యరీతులు సమకూర్చినారు. 800 చిత్రాలకుపైగా డ్యాన్స్‌ మాస్టర్‌ గా పనిచేసి, దాదాపు 30 చిత్రాల్లో నటించారు. 2011లో మగధీర చిత్రానికి జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఈయన అమ్మోరు, సూర్యవంశం, అల్లరి పిడుగు, మగధీర, అరుంధతి, మహాత్మా, బాహుబలి ది బిగినింగ్‌ వంటి చిత్రాలకు కొరియోగ్రఫీ చేసారు. ఈయన చనిపోవడం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.