‘రాధే శ్యామ్‌’లో నృత్య కళాకారిణిగా భాగ్యశ్రీ లుక్‌ రివీల్‌

పాన్‌ ఇండియన్‌ స్టార్‌ ప్రభాస్‌ ` పూజా హెగ్డే జంటగా రూపొందుతున్న పీరియాడీల్‌ లవ్‌ స్టోరి ’రాధే శ్యామ్‌’. తాజాగా ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్న సీనియర్‌ నటి భాగ్యశ్రీ లుక్‌ రివీల్‌ అయింది. యూవీ క్రియేషన్స్‌ ` టి సిరీస్‌ కలిసి భారీ బ్జడెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్‌ వర్క్‌ పూర్తికావచ్చినట్టు తెలుస్తోంది. కొత్త సంవత్సరంలో సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న అత్యంత భారీ స్థాయిలో ’రాధే శ్యామ్‌’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. కాగా, త్వరలో చిత్రబృందం ప్రమోషనల్‌ కార్యక్రమాలను ప్రారంభించబోతున్నారు. ఇదే క్రమంలో తాజాగా బాలీవుడ్‌ సీనియర్‌ నటి భాగ్యశ్రీ పాత్రకు సంబంధించిన లుక్‌ను సోషల్‌ విూడియా ద్వారా వదిలారు. ఇందులో ఆమె నటరాజస్వామి ఎదురుగా నాట్యం చేస్తూ కనిపిస్తున్నారు. ఈ సందర్భంగా ’ప్రపంచమే ఒక నాటక రంగం .. అందులో మనమంతా పాత్రధారులం .. ఎవరి పాత్రను వాళ్లు పోషించాలి’ అంటూ భాగ్యశ్రీ ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ లుక్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. కాగా, డిసెంబర్‌ మొదటి వారంలో ’రాధే శ్యామ్‌’ నుంచి సెకండ్‌ సింగిల్‌ రాబోతున్నట్టు సమాచారం. ఈ సాంగ్‌ను సిద్‌ శ్రీరామ్‌ పాడారు. ఇక ఈ సినిమాకు సౌత్‌ భాషలకు గానూ జస్టిన్‌ ప్రభాకరన్‌, హిందీ భాషకు గాను మనన్‌ భరద్వాజ్‌ సంగీతం అందిస్తున్నారు.