దొంగతనం జరిగింది….టమాటాల ట్రేలు మాయం

ఎక్కడైనా దొంగతనం జరిగింది అంటే అక్కడ డబ్బులు, లేదా బంగారం, వెండి, ఏదైనా ఖరీదు గల వస్తువులు మాయం అయి ఉంటాయి కానీ పెనుగంచిప్రోలులో వింత ఘటన చోటుచేసుకుంది.మార్కెట్లో టమాటా కు విపరీతమైన రేటు ఉండటంతో ఆగంతకులు కు టమాటాలపై కన్ను పడి౦ది.పెనుగంచిప్రోలు గ్రామంలో సత్రం సెంటర్లోని కూరగాయల మార్కెట్ లో గురువారం రాత్రి సమయంలో 3 ట్రే లా టమాటా లు మాయమయ్యాయి. కూరగాయల వ్యాపారి ఎప్పటి లాగానే ఉదయం నుంచి సాయంత్రం 8 గంటల వరకు కూరగాయలు మార్కెట్లో వ్యాపారం చేసుకొని అనంతరం మార్కెట్ను మూసివేసి ఇంటికి వెళ్లారు. అదే అదునుగా తీసుకొని రాత్రి సమయంలో అగంతకులు టమాటాల ట్రే లను మాయం చేశారు. ఒక్కో ట్రే 2000 రూ పై ఉంటుంది అని తెలుపుతున్నారు.నెల రోజులు కష్టపడి కూరగాయలు అమ్ముకున్న ఆరువేల రూపాయలని 6000 విలువగల టమాటాలు మాయమవటంతో వ్యాపారస్తులు లబోదిబోమంటున్నారు.