Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కత్తి విూద సాములా మారిన వ్యవసాయం !

అన్నదాతల బతుకులు పాలకుల నిర్ణయాల విూద ఆధారపడ్డాయి. పంటలు వేయాలన్నా.. వేసుకోవద్దన్నా.. ప్రత్యామ్నాయ పంటలు వేయాలన్నా ఆలోచనలో పడ్డారు. మొత్తంగా వ్యవసాయం ఇప్పుడు కత్తివిూద సాముగా మారాయి. ఎన్ని అవకాశాలు ఉన్నా వారు మాత్రం నిశ్చింతంగా నిద్రపోయిన రోజులు రావడం లేదు. ధాన్యం సేకరణపై ఏటేటా అస్పష్టత కొనసాగుతోంది. మద్దతు ధరల ఊసే లేకుండా పోతోంది. మార్కెట్లో దోపిడీ ఆగడం లేదు. ఇప్పటికే ధాన్యం తడిసి రైతులు ఆందోళన చెందుతున్నారు. అలాగే ధాన్యం సేకరణ మందకొడిగా సాగుతోంది.

ధాన్యం కొనుగోలు విషయంలో ఎవరు బాధ్యులన్నది ఇప్పటికీ మిథ్యగానే ఉంది. ఇది ఎవరి బాధ్యతో స్పష్టత ఇవ్వాలి. ఇప్పుడు ధాన్యం సేకరణ కోసం రైతులు ఉద్యమిం చాల్సిన అవసరం ఏర్పడిరది. పండి౦చిన ధాన్యం సేకరించడం ప్రభుత్వాల బాధ్యత. అది కేంద్రమా.. రాష్ట్రమా అన్నది వారు తేల్చుకోవాలి. కానీ ఏటా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేయడం సరికాదు. సాగుచట్టాలను రద్దు చేసిన సందర్బంగా రైతుల ఆదాయం రెట్టంఇపు చేసేలా చేస్తామన్న ప్రధాని మోడీ ఈ పార్లమెంట్‌ సమావేశాల్లో సాగుచట్టాల రద్దుకు పూనుకోబోతున్నారు. ఇదే క్రమంలో దేశంలో పంటల సాగు కు, ధాన్యం సేకరణ, మద్దతు ధరలపై చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవాలి.

రైతులకు అండగా విప్లవాత్మక నిర్ణయలు తీసుకోవాలి. ఈ నిర్ణయం వ్వయసాయాన్ని ఆదుకునేలా, అగ్రి యూనిట్లు పెట్టుకునేలా, దేశానికే కాకుండా ప్రపంచానికి మార్గం చూపేలా నిర్ణయాలు ఉంటే మోడీ నిజమైన నేతగా నిలుస్తారు. లేకుంటే మోడీ మాటలను కూడా ఇక అన్నదాతలు నమ్మే పరిస్థితి రాదు.  వానాకాలం పంటల కొనుగోళ్ల సక్రమంగా సాగక పోవడంతో యాసంగిలో వరిసాగు నత్తనడకన సాగుతోంది. మరోవైపు ధాన్యం కొనుగోలుపై కేంద్ర నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న వరి రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు చూస్తుననారు. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలన్న సూచనలతో సాగుకు రైతులు సన్నద్దం అవుతున్నారు.  యాసంగి పంటల సాగు ప్రారంభమైనా వరిసాగు విస్తీర్ణంలో ఏ విధమైన పురొగతి కనిపించటం లేదు.

కేంద్ర ప్రభుత్వం వరిని కొనుగోలు చేస్తుందా? లేదా? అన్న ఆందోళనలో ఉన్నారు. ఉన్న పంటను అమ్ము కోవడం, కొత్త పంటల కోసం సన్నద్దం కావడం ఇప్పుడు రైతులకు కత్తివిూదసాములా మారింది. ఏ పంట వేయాలో..ఏ పంట వేయకూడదో అన్న ఆందోళనలో రైతులు ఉన్నారు. ఏ పంటవేసినా ఖచ్చింతంగా మద్దతు ధరలు దక్కు తాయన్న భరోసా లేదు. అలాగే పండిరచిన పంటలను అమ్ము కుంటామన్న ధైర్యం చిక్కడం లేదు. దీంతో వారంతా అయోమయంలో ఉన్నారు. ఈ యాసంగి సీజన్‌ ప్రారంభమై నెల రోజులు అవుతున్నప్పటికీ రైతులు వరినారు మళ్లపై దృష్టి పెట్టలేదు. రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి నదుల పరివాహకంగా ఉన్న ప్రాజెక్టుల్లో నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. అంతే కాకుండా ఇటీవల కురిసిన వర్షాలకు చిన్న , మద్య తరహా ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయిలో నిండివున్నాయి.

పూర్తినీటి మట్టాలతో నిండు కుండలను తలపి స్తున్నాయి. మరో వైపు భూగర్భ జలాలు సైతం అందుబాటులో ఉన్నాయి. యాసంగిలో వరిసాగుకు అన్ని విధాల అనుకూలత ఉన్నప్పటికీ ధాన్యం విక్రయాల్లో ఎదురవుతున్న మార్కెట్‌ సమస్యలను దృష్టిలో ఉంచుకొని రైతులు నష్టపోకుండా ప్రభుత్వం ముందుకు రావాల్సి ఉంది. రైతులు పండిరచే ధాన్యం నిల్వలను పెద్ద మొత్తంలో కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తే తప్ప వాటిని బహిరంగ మార్కెట్లో రైతులు అమ్మకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు ప్రత్యామ్నాయ పంటల సాగు విస్తీర్ణం ఊపందుకుంది. పప్పుధాన్య పంటల సాగు వేగంగా పెరుగుతూ వస్తోంది. యాసంగి సీజన్‌లో పప్పుధాన్యాల విస్తీర్ణం పెరిగింది. శనగ, కంది, పెసర , మినుము,ఉలవ తదితర పంటలపైనా రైతులు పండి స్తున్నారు. మరోవైపు నూనెగింజ పంటల సాగులో కూడా వేగం పెరిగింది. వేరుశనగ,నువ్వులు, పొద్దు తిరుగుడు,, కుసుమ తదితర  నూనెగిజ పంటలు వేయడానికి కూడా సిద్దమయ్యారు.  నూనెగింజ పంటల సాధారణ విస్తీర్ణంకంటే పెరిగింది. పప్పుదాన్యాలు , నూనెగింజ పంటలసాగుకు ఇంకా అదను ఉండటంతో ఈ పంటలసాగు ఈ సారి అంచనాలకు మించి సాగులోకి వచ్చే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికార వర్గాలు చెబుతు న్నాయి. ఈ  అంశాలపై స్పష్టత వచ్చే వరకూ వరిని సాగు చేయాలా వద్దా అని చూస్తున్నారు. మరోవైపు  రైతులు వరిని సాగు చేయకుండా ఆలోచన చేస్తున్నారు.

సాధారణంగా వరిపండే పొలాల్లో ఇతరత్రా పంటలు పండాలంటే కొంత కసరత్తు చేయాలి. కేంద్రం ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు కనుక ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని అధికారులు కూడా సూచిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర రైతాంగం రికార్డు స్థాయిలో మినుమును సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వరిని పండిరచిన రైతాంగం వరిని కాకుండా మినుము పంటను సాగు చేయ డానికి ఉపక్రమించారు. మినుము పంటను రైతాంగం సాగు చేశారని వ్యవసాయశాఖ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వం ఏడాదికి ఎంత మేరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందో ఆ మేరకు వరిని సాగు చేయాలా? వద్దా? అని తుది నిర్ణయం తీసుకొంటామని సిఎం చేసిన సూచన మేరకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కోసం, తెలంగాణ వరి రైతులు ఎదురు చూస్తున్నారు.

ఉత్తర భారత దేశంలోని రాష్టాల్ల్రో  రైతులు పండిరచిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తున్న కేంద్రం తెలంగాణ రాష్ట్ర వరి రైతుల పట్ల ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందోనని ఉత్కంఠతతో రైతులు వరిని సాగు చేయకుండా ఎదురు చూస్తున్నారని వ్యవసాయ శాఖాధికారులు అంటున్నారు. ఈ క్రమంలో జాతీయ స్థాయిలో ఉద్యమం చేసినట్లుగా కనీస మద్దతు ధరల కోసం..పంటల కొనుగోళ్ల కోసం ఉద్యమించాల్సిన ఆగత్యం ఏర్పడిరది. ఈ క్రమంలో వ్యవసాయ సాగుచట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనలు ఇప్పుడే ఆగవని, భవిష్యత్తు కార్యాచరణ ను ఈనెల 27న జరిగే సమావేశంలో నిర్ణయిస్తామని భారతీయ కిసాన్‌ యూనియన్‌  నేత  రాకేశ్‌ తికాయత్‌  తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా రైతులను సంఘటిత పర్చాల్సిన అవసరం ఏర్పడి౦ది.

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని కేంద్రం చేసిన వాగ్దానాలన్నీ బూటకమని తేలింది. మోదీ సర్కారు ఇచ్చిన హావిూలు అమలుకు నోచుకోలేదు. రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని ప్రధాని మోదీ చెప్పినందున ..రైతులను ఏ విధంగా ఆదుకుంటారో చెప్పాలి. కేంద్ర తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢల్లీి సరిహద్దుల్లో రైతులు ఏడాదికాలంగా నిరసన ప్రదర్శనలు కొనసాగించడంతో ఆఖరుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ మూడు చట్టాలను ఉపసంహరించు కుంటున్నట్లు ఈనెల 19న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సమగ్ర వ్యవసాయ విధానంతో ముందుకు వస్తే తప్ప రైతులు ప్రధానిని నమ్మబోరు.