వైరల్‌గా రామ్‌ చరణ్‌ న్యూలుక్‌..!

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, క్రేజీ హీరోయిన్‌ కియారా అద్వానీ జంటగా క్రియేటివ్‌ జీనియస్‌ శంకర్‌ ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీలోని చరణ్‌ లుక్‌ ఇదేనంటూ లేటెస్ట్‌ పిక్‌ ఒకటి సోషల్‌ విూడియాలో చక్కర్లు కొడుతూ వైరల్‌ అవుతోంది. దర్శక ధీరుడు ఎస్‌ ఎస్‌ రాజమౌళి రూపొందిస్తున్న ’ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో చరణ్‌ మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. దీనికోసం డిఫరెంట్‌గా మేకోవర్‌ అయిన చరణ్‌ మూవీ కంప్లీట్‌ అవడంతో శంకర్‌ సినిమాకోసం మరో సరికొత్త మేకోవర్‌తో తయారయ్యాడు. అయితే, ఇప్పటివరకు దానికి సంబంధించిన లుక్‌ రివీల్‌ కాలేదు. తాజాగా, చరణ్‌ ` శంకర్‌ మూవీ షుటింగ్‌ లొకేషన్‌ నుంచి ఓ సరికొత్త లుక్‌లో ఉన్న చరణ్‌ పిక్‌ బయటకి వచ్చింది. ఈ లుక్‌ గతంలో చరణ్‌ నటించిన ’ఆరెంజ్‌’ మూవీలోని లుక్‌ తరహాలో చాలా స్టైలిష్‌గా ఉంది. ప్రస్తుతం ఈ లుక్‌లో చరణ్‌ బాగా ఆకట్టుకుంటున్నాడు. కాగా, ప్రస్తుతం ఈ మూవీ సెకండ్‌ షెడ్యూల్‌ శరవేగంగా జరుగుతోంది. దిల్‌ రాజు భారీ బ్జడెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.