అనీల్‌ రావిపూడితో పవన్‌ కళ్యాణ్‌ మూవీ..

వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న కుర్ర డైరెక్టర్‌ అనీల్‌ రావిపూడి పటాస్‌ చిత్రంతో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత ’సుప్రీమ్‌, రాజా ది గ్రేట్‌, ఎఫ్‌ 2, సరిలేరు నీకెవ్వరు’ వంటి విజయాలతో హిట్‌ చిత్రాల దర్శకుల్లో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ’ఎఫ్‌ 3’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా

ఫిబ్రవరిలో విడుదల కానుంది. అయితే ఈ సినిమా తర్వాత బాలయ్యతో మూవీ చేయనున్నాడు అనీల్‌.

సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేష్‌తో మరో మూవీ చేయాల్సి ఉండగా, ఇది ఇప్పట్లో కుదిరేలా లేదు. త్రివిక్రమ్‌ సినిమా తర్వాత మళ్లీ వెంటనే రాజమౌళి సినిమా చేయాలి కాబట్టి సమయం కాస్త ఎక్కువగానే పడుతుంది. ఆ లోపు నందమూరి బాలకృష్ణ తో ఒక సినిమాను చేసే అవకాశం ఉంది. బాలకృష్ణను గతంలో ఎప్పుడూ చూపించని విధంగా అలాగే మాస్‌ ప్రేక్షకులకు సరికొత్తగా ప్రజెంట్‌ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే ఆయన టైమింగ్‌ కు తగ్గట్టుగా కామెడీ కూడా ఉంటుంది. దాంతో పాటు నందమూరి బాలయ్య అభిమానులు కోరుకునే అన్ని అంశాలు కూడా గట్టిగానే ఉంటాయి అని అన్నారు అనీల్‌.

ఇక అనీల్‌ రావిపూడి` పవన్‌ కళ్యాణ్‌ కాంబోలో కూడా సినిమా ఒకటి ఉందట. దీనిని అనీల్‌ స్వయంగా లేటెస్ట్‌ ఇంటర్వ్యూ లో వెల్లడిరచారు. దీనితో ఈ సెన్సేషనల్‌ కాంబో కార్డ్స్‌ విూదకి వచ్చినట్టు అయ్యింది. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ ఎప్పుడు నుంచి స్టార్ట్‌ అవుతుంది అనే ఇతర అంశాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పవన్‌ .. ‘భీమ్లా నాయక్‌‘ మరియు ‘హరిహర వీరమల్లు‘ అనే రెండు ఇంట్రెస్టింగ్‌ చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.