బిగ్‌ బాస్‌ హోస్ట్‌గా శృతి హాసన్‌..!

బిగ్‌ బాస్‌ హోస్ట్‌గా మరో స్టార్‌ హీరోయిన్‌ సందడి చేయబోతుందనే వార్త ప్రస్తుతం సోషల్‌ విూడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే సమంత, రమ్యకృష్ణ లాంటి వారు కొన్ని స్పెషల్‌ ఎపిసోడ్స్‌కు హోస్ట్‌గా వచ్చి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు స్టార్‌ హీరోయిన్‌ శృతి హాసన్‌ కూడా హోస్ట్‌గా వ్యవహరించబోతోందట. అసలు విషయంలోకి వెళ్తే..ఇటీవలే అమెరికా నుంచి తిరిగొచ్చిన కమల్‌ హాసన్‌ కరోనా బారిన పడ్డారు. దాంతో ఆయన ప్రస్తుతం ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం లోకేష్‌ కనగ్‌ రాజ్‌ దర్శకత్వంలో కమల్‌ నటిస్తున్న ’విక్రమ్‌’ మూవీ షూటింగ్‌కు బ్రేక్‌ పడిరది. అంతేకాదు ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌ బాస్‌ తమిళ్‌ సీజన్‌ 5కు అంతరాయం కలిగింది. దాంతో ఇప్పుడు కమల్‌ ప్లేస్‌ను ఆయన కూతురు శృతి హాసన్‌తో భర్తీ చేయాలని బిగ్‌ బాస్‌ నిర్వాహకులు ఎª`లాన్‌ చేస్తున్నారట. శృతి హాసన్‌ హీరోయిన్‌గా మాత్రమే కాకుండా సింగర్‌గా, మ్యూజిక్‌ కంపోజర్‌గా సత్తా చాటుతుంది. కాబట్టి కమల్‌ ప్లేస్‌లో శృతి అయితే పర్‌ఫెక్ట్‌ అని భావిస్తున్నారట. త్వరలో దీనిపై అఫీషియల్‌ కన్‌ఫర్మేషన్‌ రానుందని సమాచారం.