న్యూజిలాండ్ జట్టులో ఇద్దరు భారత సంతతి ఆటగాళ్లు

న్యూజిలాండ్ జట్టులో ఇద్దరు భారత సంతతి ఆటగాళ్లు
జట్టులో ప్రముఖంగా ఉన్న అజాజ్ పటేల్, ఇష్ సోధిలు
న్యూజిలాండ్ జట్టులో భారత సంతతి ఆటగాళ్ల వారసత్వం కొత్తేవిూ కాదు. ప్రస్తుతం కివీస్ జట్టులో స్పిన్నర్లు అజాజ్ పటేల్, ఇష్ సోధిలు భారత సంతతి ఆటగాళ్లు. గురువారం కాన్పూర్‌లో ప్రారంభమయ్యే టెస్ట్‌లో ఆడే అవకాశం ఉంది. అజాజ్ పాటిల్ తన ఎనిమిదేళ్ల వయస్సులోనే అతని కుటుంబం న్యూజిలాండ్‌కు వెళ్లి స్థరపడ్డారు. 33 ఏళ్ల అజాజ్ పటేల్ ఈ లెప్టార్మ్ స్పిన్నర్ అంతర్జాతీయ క్రికెట్లోకి రావడానికి ఎక్కువ సమయమే తీసుకున్నాడు. 30 ఏళ్ల వయసులో అతను న్యూజిలాండ్ టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆ తర్వాత టెస్టుల్లోనూ అవకాశం లభించింది. అజాజ్ 9 టెస్టుల్లో 30.46 సగటుతో 26 వికెట్లు, 7 టీ20ల్లో 10.72 సగటుతో 11 వికెట్లు తీశాడు. ఇంకా వన్డేల్లో అతడికి అవకాశం దక్కలేదు. ‘నేను ఇంతకు ముందు చూడని భారతదేశంలోని కొన్ని ప్రాంతాలకు ఇప్పుడు వెళ్లాను‘ అని పటేల్ అన్నాడు. ఇండియాను సొంత దేశంలో ఎదుర్కొవడం సవాల్‌గా ఉంటుందన్నారు. భారత జట్టులో అశ్విన్, రవీంద్ర జడేజా స్పిన్నర్లు ఉన్నారని చెప్పాడు. ఇష్ సోధి పంజాబ్‌లోని లుధియానాలో పుట్టాడు. చిన్న వయసులోనే కుటుంబంతో కలిసి న్యూజిలాండ్‌కు వెళ్లి స్థిరపడ్డాడు. యూత్ స్థాయిలో ఆక్లాండ్‌లో క్రికెట్లో అవకాశం లభించింది.. తన లెగ్ స్పిన్‌తో సత్తా చాటుకుని న్యూజిలాండ్
అండర్`19 జట్టుకు ఎంపికయ్యాడు. ఆ తర్వాత టెస్టు మ్యాచ్‌తో అంతర్జాతీయ అరంగట్రేం చేయడం విశేషం. 2013లో తొలి టెస్టు ఆడిన సోధి.. ఆ తర్వాతి రెండేళ్లలో టీ20లు, వన్డేల్లోనూ అవకాశం దక్కించుకున్నాడు. అరంగేట్రం చేసింది టెస్టుల్లో అయినా.. టీ20ల్లోనే అతను ఎక్కువ ప్రభావం చూపాడు. 29 ఏళ్ల ఇష్ ఇప్పటిదాకా 17 టెస్టుల్లో 41, 33 వన్డేల్లో 43, 66 టీ29ల్లో 83 వికెట్లు పడగొట్టాడు.