మైనర్‌గా ఉండగానే మారడోనా తనపై …అల్వరేజ్ రీగో..!
ఫుట్ బాల్ దిగ్గజం మారడోనాపై సంచలన నిజాలు
ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా స్టార్ ప్లేయర్.. దివంగత డీగో మారడోనా.. తనను రేప్ చేసినట్లు 37 ఏళ్ల మహిళ ఆరోపించింది. బ్యూనస్‌ఎయిరిస్‌లో క్యూబాకు చెందిన మావిస్ అల్వరేజ్ రీగో విూడియాతో మాట్లాడుతూ.. 20 ఏళ్ల క్రితం తాను మైనర్‌గా ఉన్న సమయంలో.. ఫుట్‌బాల్ హీరో డీగో మారడోనా తనను శారీరకంగా వేధించినట్లు పేర్కొన్నది. 16 ఏళ్ల వయసులో.. మారడోనాను క్యూబాలో కలిశానని, 40 ఏళ్ల వయసులో అతను డ్రగ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు దగ్గరయ్యామని, కానీ రానురాను మారడోనా తనను కొకైన్ తీసుకునేలా చేశాడని, అతనిపై ఆధారపడే విధంగా తనను మార్చేసినట్లు ఆమె ఆరోపించింది. 60 ఏళ్ల వయసులో బ్రెయిన్ సర్జరీ చేయించుకున్న మారడోనా.. గత ఏడాది మరణించిన విషయం తెలిసిందే. మారడోనాను ప్రేమించడమే కాదు.. అతన్ని ద్వేషించినట్లు కూడా ఆమె చెప్పింది. ఓ దశలో సూసైడ్ చేసుకోవాలనిపించినట్లు ఆమె వెల్లడిరచింది. వరల్డ్‌కప్ అందించిన మారడోనాతో ఓ అయిదారేళ్ల పాటు అల్వరేజ్ రీగో రిలేషన్‌లో ఉంది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2001లో బ్యూనస్ ఎయిరిస్ వెళ్లిన తనను మారడోనా ఓ హోటల్ గదిలో బంధించాడని, కొన్ని వారాల పాటు తనను వేధించినట్లు ఆమె చెప్పింది. హవానాలోని ఇంట్లో తనను రేప్ చేసినట్లు కూడా ఆమె ఆరోపించింది. నవంబర్ 25వ తేదీన మారడోనా తొలి వర్థంతి నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అల్వరేజ్ రీగో ఫిర్యాదు మరోసారి బయటకు వచ్చింది.