తడబడిన విండీస్
శ్రీలంకతో తొలి టెస్ట్‌లో ఆరు వికెట్లకు 113 పరుగులు
శ్రీలంకతో తొలి టెస్ట్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ మొదటి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లకు 113 పరుగులు చేసింది. టాపార్డర్ తడబడటంతో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ వెనుకంజలో పడిరది. స్పిన్నర్లు రమేశ్ మెండిస్ (3/23), జయవిక్రమ (2/25) దెబ్బకు వెస్టిండీస్ విలవిల్లాడిరది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్ స్కోరు (386ఆలౌట్)కు వెస్టిండీస్ ఇంకా 273 పరుగులు వెనుకంజలో ఉండగా, నాలుగు వికెట్లే చేతిలో ఉన్నాయి. కెప్టెన్ బ్రాత్‌వైట్ (41) ఫర్వాలేదనిపించగా.. మిగిలినవాళ్లు విఫలమయ్యారు. లంక బౌలర్లలో రమేశ్ 3, ప్రవీణ్ రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 386 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ దిముత్ కరుణరత్నె (147) భారీ సెంచరీతో కదం తొక్కగా.. ధనంజయ డిసిల్వ (61), దినేశ్ చండిమాల్ (45) రాణించారు. విండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్ 5, వారికన్ మూడు వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం చేతిలో 4 వికెట్లు ఉన్న విండీస్.. లంక తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 273 పరుగులు వెనుకబడి ఉంది. హోల్డర్ (1), మయేర్స్ (22) క్రీజులో ఉన్నారు.