రెండేళ్లుగా ఒక్క సెంచరీ కూడా చేయని కోహ్లీ

టెండూల్కర్‌ను బీట్‌ చేయడంలో కోహ్లీ వెనకబడ్డాడా?

రెండేళ్లుగా ఒక్క సెంచరీ కూడా చేయని కోహ్లీ

ఈ తరం క్రికెటర్లలో మెరుగైన ఆటగాడు గా పేరొందిన విరాట్‌ కోహ్లీ పరుగుల్లో మళ్లీ వెనకబడ్డాడా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌ లోకి వచ్చిన సమయం నుండి కోహ్లీ వరుసగా రికార్డులను బ్రేక్‌ చేస్తూ  కొత్త రికార్డులను క్రియేట్‌ చేస్తూ వస్తున్నాడు. అయితే కోహ్లీ ఒక్కడే సచిన్‌ నెలకొల్పిన 100 సెంచరీల రికార్డును బద్దలు కొట్టగలడు అని అందరూ అనుకున్నారు. కానీ ఈ మధ్య కోహ్లీ అనుకున్న విధంగా పరుగులు చేయడం లేదు. ఎంతలా అంటే.. కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌ లో సెంచరీ నమోదు చేసి రెండు సంవత్సరాలు పూర్తి అవుతుంది. 2019లో ఇదే రోజున బంగ్లాదేశ్‌ తో భారత జట్టు ఆడిన మొదటి పింక్‌`బాల్‌ టెస్టులో విరాట్‌ కోహ్లీ 194 బంతుల్లో 136 పరుగులు చేసి తన 70 వ శతకాన్ని పూర్తి చేసాడు. అదే ఇప్పటివరకు కోహ్లీ చేసిన ఆఖరి సెంచరీ. ఇక ఈ రెండేళ్లలో ఆడిన మ్యాచ్‌ లలో కోహ్లీ 80, 90 పరుగుల వరకు వచ్చినా  వాటిని సెంచరీల మార్చలేకపోయాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ అత్యధిక శతకాలు చేసిన జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. మొదటి రెండు స్థానాల్లో సచిన్‌ టెండూల్కర్‌ 100, రికీ పాంటింగ్‌ 71 సెంచరీలతో

ఉన్నారు.