25 నుంచి కాన్పూర్‌లో తొలి టెస్ట్
ఆజింక్యరహానే కెప్టెన్సీలో కసరత్తు
గాయం కారణంగా కెఎల్ రహానే దూరం
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందే టీమిండియాకు బిగ్‌షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ తొడ గాయంతో సిరీస్ మొత్తానికే దూరమయ్యాడు. అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను జట్టులోకి ఎంపిక చేసినట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. 25 నుంచి కాన్పూర్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. ఈ మేరకు జట్టును ప్రకటించారు. ఇక రహానే సారథ్యంలో టీమిండియా తొలి టెస్టు ఆడనుంది. రాహుల్ గాయంతో దూరమవ్వడంతో శుబ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్‌లు ఓపెనింగ్ చేయనున్నారు. కేఎల్ రాహుల్ తొడ కండరంపై ఒత్తిడి పడుతుండడంతో నొప్పి పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం అతనికి విశ్రాంతి అవసరం. అందుకే న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు దూరం కావాల్సి వచ్చింది. గాయం తగ్గిన తర్వాత రాహుల్ నేరుగా ఎన్‌సీఏకి వెళ్లిపోతాడు. అక్కడే ఫిట్‌నెస్ నిరూపించుకొని వచ్చే నెలలో జరగనున్న సౌతాఫ్రికా టూర్‌కు అందుబాటులో ఉంటాడు. ప్రస్తుతం రాహుల్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను జట్టులోకి ఎంపిక చేస్తూ సీనియర్ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది.‘ అని బీసీసీఐ అధికారి తెలిపారు. కాగా ఇప్పటికే రోహిత్, కోహ్లి గైర్హాజరీ కానుండడం.. తాజాగా రాహుల్ కూడా దూరమవ్వడం టీమిండియాకు పెద్ద దెబ్బగా మారనుంది. వరల్డ్‌టెస్టు చాంపియన్‌షిప్ నేపథ్యంలో ప్రతీ టెస్టు మ్యాచ్ కీలకమే. టీమిండియా టెస్టు జట్టు: అజింక్య రహానె (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ఆర్. అశ్విన్, అక్సర్ పటేల్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ