‘దసరా’ లో నానితో మరో హీరో?

నేచురల్ స్టార్ నానీ ప్రస్తుతం ’శ్యామ్ సింగరాయ్’ చిత్రంలో నటిస్తున్నారు. డిసెంబర్ 24న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమాలో నానీ పవర్ ఫుల్ జర్నలిస్ట్ పాత్రను పోషిస్తున్నారు. ఇక నానీ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ’అంటే సుందరానికీ’ మూవీలో కూడా నటిస్తున్నారు. దీని తర్వాత నానీ కమిట్ అయిన మరో సినిమా దసరా. ఓదెల శ్రీకాంత్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాతో మొట్టమొదటి సారిగా తెలంగాణా యాస లో పూర్తి స్థాయిలో డైలాగ్స్ చెప్పబోతున్నారు నానీ.
సింగరేణి బొగ్గుగనుల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నానీకి ఒక ఫ్రెండ్ పాత్ర కూడా ఉంటుందట. ఆ పాత్ర సినిమాకే కీలకమని తెలుస్తోంది. ఈ రెండు పాత్రల బాండిరగే సినిమాలోని హైలైట్ పాయింట్ అని చెబుతున్నారు. అందుకే దానికోసం ఓ యంగ్ హీరోని తీసుకుంటే బెటరని ఆలోచిస్తున్నారట మేకర్స్. ఇప్పటికే పేరున్న ఇద్దరు హీరోల్ని సంప్రదించారట. ఆ ఇద్దరిలో ఎవరైనా ఓకే చెబితే సినిమాకి మంచి వెయిట్ ఉంటుందని భావిస్తున్నారట. మరి నానీతో స్క్రీన్ షేర్ చేసుకోడానికి ఏ హీరో ముందుకొస్తారో చూడాలి.