‘బంగార్రాజు’ ఫస్ట్‌ లుక్‌ టీజర్‌ విడుదల

పూలచొక్కాతో జోరుగా ముస్తాబై చిద్విలాసంగా కనిపిస్తున్నాడు సన్నాఫ్‌ బంగార్రాజు. ఆ నవ్వుల వెనకున్న మతలబు ఏమిటో.. ఈ జూనియర్‌ సోగ్గాడిని వలచిన వయ్యారి ఎవరో తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే’ అంటున్నారు కల్యాణ్‌కృష్ణ. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ’బంగార్రాజు’. అక్కినేని నాగార్జున, నాగచైతన్య హీరోలుగా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌, జీ స్టూడియోస్‌ పతాకాలపై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రమ్యకృష్ణ, కృతిశెట్టి కథానాయికలు. సోమవారం నాగచైతన్య ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదలచేసింది. ఈ పోస్టర్‌లో హుషారైన లుక్‌లో కొత్తగా కనిపిస్తున్నారాయన. చిత్రబృందం మాట్లాడుతూ ’సోగ్గాడే చిన్నినాయన’కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రమిది. రొమాన్స్‌, ఎమోషన్స్‌తో పాటు వాణిజ్య హంగులన్నీ ఉంటాయి. నాగార్జున, నాగచైతన్య పాత్రలు మాస్‌, క్లాస్‌ మేళవింపుతో నవ్యరీతిలో సాగుతాయి. ఇటీవల విడుదలైన కృతిశెట్టి ఫస్ట్‌లుక్‌తో పాటు ’లడ్డుండా’ పాటకు చక్కటి స్పందన లభిస్తున్నది. ప్రస్తుతం మైసూర్‌లో చిత్రీకరణ జరుపుతున్నాం’ అని తెలిపారు..