ఇప్పట్లో పెళ్లి చేసుకోను : రకుల్ ప్రీత్ సింగ్

అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ తన 31వ పుట్టినరోజు సందర్భంగా తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది. కొంత కాలంగా బాలీవుడ్ హీరో జాకీ భగ్నానీతో సీక్రెట్‌గా ప్రేమాయాణం నడిపిన రకుల్ వారి బంధాన్ని అధికారికంగా ప్రకటించింది. దీంతో రకుల్ త్వరలోనే జాకీని పెళ్లి చేసుకోబోతోందని, అందుకే తమ రిలేషన్‌షిప్ ఆఫీషియల్‌గా ప్రకటించిందని ప్రచారం జరిగింది. దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చింది రకుల్.
ప్రస్తుతం థ్యాంక్స్ గాడ్ చిత్ర ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ తన పెళ్లికి సంబంధించి ఆసక్తికర విషయాలు తెలియజేసింది. నా వ్యక్తిగత జీవితం గురించి ఎందుకు బయటపెట్టానంటే..అది ఓ అందమైన విషయం. అందరితో పంచుకోవాలనుకున్నా.పెళ్లికి అంత తొందరలేదు. ప్రస్తుతం నా దృష్టి అంతా కెరీర్‌పైనే ఉంది. ఇప్పటికైతే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు. సమయం వచ్చినప్పుడు అందరితో పంచుకుంటానని పేర్కొంది రకుల్.
జాకీ భగ్నానీ బాలీవుడ్ నటుడు, నిర్మాతగా రాణిస్తున్నాడు. ఈయన కోల్‌కతాలోని సింధీ ఫ్యామిలిలో జన్మించారు. పూజా ఎంట్టంల్గªన్‌మెంట్స్ పేరు విూద అతని తండ్రి వషు భగ్నానీ మూవీస్ నిర్మిస్తున్నారు. జాకీ భగ్నానీ.. 2009లో ఓ హిందీ మూవీలో ఇండస్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఎక్కువగా సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేశారు. 2016లో సరబ్జిత్ సినిమాతో ప్రొడ్యూసర్‌గా కూడా తన అభిరుచి చాటుకున్నాడు.