సెన్సార్‌ పూర్తి చేసుకున్న ‘అఖండ’

సీనియర్‌ స్టార్‌ నందమూరి బాలకృష్ణ, స్టార్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్‌ మూవీ ’అఖండ’. డిసెంబర్‌ 2న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్‌ లభించింది. ఈ చిత్రంలో బాలకృష్ణ తన నట విశ్వరూపాన్న చూపించాడు. అఘోరగా బాలకృష్ణ మాస్‌ ప్రేక్షకులకు విజువల్‌ ట్రీట్‌ ఇవ్వనున్నారు. సెకండ్‌ హాప్‌లో బాలకృష్ణను అఘోరగా ఇంటెన్స్‌, యాక్షన్‌ అవతారంలో చూపించాడు దర్శకుడు బోయపాటి శ్రీను. ద్వితీయార్థంలో బాలయ్య ఉగ్రరూపం కనిపిస్తుంది. మరోవైపు శ్రీకాంత్‌ విలనిజం కూడా హైలెట్‌ కానుంది. జగపతిబాబు పాత్ర కూడా ప్రేక్షకులని మెప్పించనుంది. ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని మిర్యాల రవిందర్‌ రెడ్డి ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు.