యన్టీఆర్‌ సరసన జాన్వీ కపూర్‌ ?

యంగ్‌ టైగర్‌ యన్టీఆర్‌, కొరటాల శివ కలయికలోని రెండో సినిమా త్వరలోనే సెట్స్‌ విూదకు వెళ్ళబోతున్న సంగతి తెలిసిందే. యన్టీఆర్‌ 30 గా విశేషాన్ని సంతరించుకున్న ఈ సినిమా రాజకీయ నేపథ్యంలోని సామాజిక సందేశం కలిగిన చిత్రమని తెలుస్తోంది. ఇక ఇందులో కథానాయిక ఎవరనే విషయంలో ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. కొద్ది రోజులుగా కథానాయికగా కియారా అద్వానీ పేరు వినిపిస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఇందులో కథానాయికగా అతిలోకసుందరి శ్రీదేవి తనయ జాన్వీకపూర్‌ ను కథానాయికగా కొరటాల ఎంపిక చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇది వినడానికి, అభిమానులు ఖుషీ చేయడానికి చాలా ఆసక్తిగా ఉంది. నిజానికి జాన్వీని సౌత్‌ లో కథానాయికగా  పరిచయం చేయాలని శ్రీదేవి అనుకొనేవారు. కానీ అప్పట్లో అది సాధ్యం కాలేదు.

కొరటాల శివ సినిమాతో అది ఇన్నాళ్ళకు సాధ్యం కానుందని అనుకుంటున్నారు. మరి ఈ వార్తలో నిజానిజాలేంటో తెలియదు కానీ.. ప్రస్తుతం కొరటాల శివ స్క్రిప్ట్‌ వర్క్‌ విూద ఉన్నారని సమాచారం. యన్టీఆర్‌ సూచించిన స్వల్ప మార్పుల్ని సవరించే పనిలో ఉన్నారట ఆయన. వచ్చే ఏడాది సమ్మర్‌ కానుకగా ఏప్రిల్‌ 22న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు ముందుగానే మేకర్స్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. జనతా గ్యారేజ్‌ తర్వాత యన్టీఆర్‌, కొరటాల కాంబినేషన్‌ లోని రెండో సినిమా అవడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి జాన్వీ కపూర్‌ నిజంగానే ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుందో లేదో తెలియాలంటే.. కొద్ది రోజులు ఆగాల్సిందే.