స్నేహితులంటే వీరే…!
స్నేహితుడి కుటుంబానికి ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయం
ఆగస్టు 27 వ తారీఖున మరణించిన హుజూర్ నగర్ లోని గోవింద పురానికి చెందిన వీసం. మధు కుటుంబానికి ఈరోజు 1,00,500 (ఒక లక్ష 500 రూపాయలు) ఆర్థిక సాయం చేయడం జరిగింది. వీసం. మధు నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఇంటర్ కాలేజీలో కాంట్రాక్ట్ లెక్చరర్ గా పని చేశారు. మధు మరణించిన తర్వాత వారి కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకొని మిత్రులంతా కలిసి వారి కుటుంబానికి అండగా నిలబడాలని నిర్ణయించారు. అతనితో పాటు చదువుకున్న మిత్రులు, సన్నిహితులు అంతా కలిసి మధు భార్య సింధు కి ఒక లక్ష ఐదు వందల రూపాయలు పిల్లల యొక్క విద్యాభ్యాసం కోసం ఈరోజు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామిశెట్టి. శ్రీనివాస్, సులువ .శ్రీను, సతీష్ ,లింగయ్య, చందు, కృష్ణ ,బుచ్చిబాబు, రమేష్, సురేష్ , నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.