‘పుష్ప’ నుండి మరో సాంగ్‌ రిలీజ్‌

సుకుమార్‌, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం ’పుష్ప’ . ఈ సినిమా తొలి పార్ట్‌ డిసెంబర్‌  17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్‌ వేగం పెంచారు మేకర్స్‌. ఇప్పటికే  ఈ సినిమా నుంచి విడుదలైన దాక్కో దక్కో మేక’, ’చూపే బంగారమయ్యేనే శ్రీ వల్లి.. మాటే మాణిక్యమాయేనే’ ’సావిూ సావిూ’  పాటలు యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్నాయి.

తాజాగా ఈ పుష్ప నుంచి నాలుగో పాటను విడుదల చేసింది చిత్ర బృందం. ఆ పక్కా నాదే.. ఈ పక్కా నాదే..తలపైన ఆకాశం ముక్కా నాదే..’ఏ బిడ్డ ఇది నా అడ్డ’అంటూ ఈ పాట సాగుతుంది. ఈ సాంగ్‌లో అల్లు అర్జున్‌ గుబురు గడ్డం, పొడవైన జుట్టుతో ఎర్రటి నిలువు బొట్టుతో ఊర మాస్‌ లుక్‌లో కనిపించారు. దేవీ శ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ అందించారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌ గా రష్మిక మందన్నా నటిస్తోన్న సంగతి తెలిసిందే. సమంత ఈ చిత్రంలో స్పెషల్‌సాంగ్‌లో కనిపింనుండటం సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది.