‘వేదాంతం రాఘవయ్య’గా సత్యదేవ్‌?

టాలీవుడ్‌ మాస్‌ డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌ .. తన శిష్యుడు చంద్రమోహన్‌ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ కథ రాసిచ్చారు. దానికి ’వేదాంతం రాఘవయ్య’ అనే క్యాచీ టైటిల్‌ ను కూడా ఫిక్స్‌ చేశారు. ఆ మధ్య ఈ సినిమా అనౌన్స్‌ మెంట్‌ కూడా జరిగింది. అందులో సునీల్‌ హీరోగా నటిస్తున్నట్టు కూడా ప్రకటించారు మేకర్స్‌. ఏకె ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ బ్యానర్‌ పై అనిల్‌ సుంకర ఈ ప్రాజెక్ట్‌ ను నిర్మించడానికి రెడీ అయ్యారు. అయితే ఇప్పుడు ఆ సినిమా చేతులు మారినట్టు టాక్‌ వినిపిస్తోంది. అనిల్‌ సుంకర ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నారట. అందుకే వేరే నిర్మాతలు ఈ సినిమాను నిర్మించబోతున్నారని తెలుస్తోంది.
అలాగే.. ఇందులో సునీల్‌ కు బదులుగా సత్యదేవ్‌ ను హీరోగా ఖాయం చేయబోతున్నట్టు వినికిడి. విలక్షణ పాత్రలతో వైవిధ్యమైన కథలతో సినిమాలు చేసే సత్యదేవ్‌.. ఇందులో టైటిల్‌ రోల్‌ పోషించనుండడం ఆసక్తిగా మారింది. సునీల్‌ ఈ ప్రాజెక్ట్‌ నుంచి ఎందుకు తప్పుకున్నారో తెలియదు కానీ.. ఈ సినిమా స్క్రిప్ట్‌ మాత్రం ఎప్పుడో పూర్తయిందట. నిర్మాత సెట్‌ అయితే.. సినిమా కంటిన్యూస్‌ గా చిత్రీకరణ జరుపుకుంటుంది. నిజానిజాలేంటో తెలియదు కానీ.. ఈ వార్త ఇప్పుడు వైరల్‌ గా మారింది. మరి ’వేదాంతం రాఘవయ్య’ గా సత్యదేవ్‌ ఏ రేంజ్‌ పెర్ఫార్మెన్స్‌ ఇస్తారో చూడాలి.