నితిన్‌కు జోడీగా కేథరిన్‌ !

నితిన్‌ హీరోగా ఎంఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వంలో రాబోతోన్న చిత్రం ’మాచర్ల నియోజకవర్గం’. రాజ్‌ కుమార్‌ ఆకెళ్ళ సమర్పణ లో ఆదిత్య మూవీస్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, శ్రేష్ట్‌ బ్యానర్‌లపై ఈ చిత్రాన్ని సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు కనిపించబోతోన్నారు. ఇందులో కృతి శెట్టి ఇదివరకే ఎంపికయ్యారు. తాజాగా కేథరిన్‌ను మరో హీరోయిన్‌గా చిత్రయూనిట్‌ ప్రకటించింది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్లోనే కేథరిన్‌ పాల్గొనబోతున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల
చేయబోతున్నారు.